Breaking News

నవీన్‌ పట్నాయక్‌ (మాజీ సీఎం) రాయని డైరీ

Published on Sun, 06/29/2025 - 05:59

కొన్ని మాటల్ని మళ్లీ తలచుకున్నప్పుడు,సందర్భం మారి – అవి పట్టలేనంత నవ్వును తెప్పిస్తాయి! ‘‘నా ఒంట్లోని ప్రతి ఎముకా సెక్యులర్‌ ఎముక. ఆ సెక్యులర్‌ ఎముకల్లో ఒక్కటైనా దెబ్బతిని ఉంటుందని నేను అనుకోను’’ – అని నేను ఎప్పుడూ అంటుండే మాటను... ఇప్పుడీ కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రి బెడ్డుపై పడుకుని ఉండగా అనుకోటానికి లేకుండా పోయింది. వైద్యులు నా సెక్యులర్‌ వెన్నెముకకు శస్త్ర చికిత్స చేశారు మరి.

‘‘పట్నాయక్‌ జీ! మీక్కొంచెం హుషారు రాగానే ఇవాళ గానీ, రేపు గానీ మీరు డిశ్చార్జ్‌ కావచ్చు...’’ అన్నారు డాక్టర్‌ రమాకాంత పాండా, నేనున్న గదిలోకి వచ్చి. డాక్టర్‌ పాండా నాకు చికిత్స చేస్తున్న వైద్యుడు కారు. నన్నిక్కడ కనిపెట్టుకుని ఉండ వలసిన వైద్యుల బృందానికి చీఫ్‌గా వచ్చిన వారు. అసలైతే ఆయన అరేబియా సముద్రానికి ఆవలా ఈవలా కూడా కార్డియాలజిస్టు.

ముంబైలోని ఆసియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌. సరిగ్గా వారం, నాకు సర్జరీ జరిగి! సర్వికల్‌ ఆర్థరైటిస్‌ అన్నారు డాక్టర్లు. మొదట మెడ నొప్పి మొదలైంది. అక్కడి నుంచి భుజాలు, చేతులు, తల. ఆ తలనొప్పి భరించ లేనంతగా ఉంటుండేది. 

‘‘చిన్న సర్జరీతో మీకు ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి పట్నాయక్‌ సర్‌...’’ అన్నారు డాక్టర్‌ రాజశేఖరన్‌. ఆయనే నాకు సర్జరీ చేసిన వైద్యుడు. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి నుంచి రప్పించారు. 

‘‘మీ సర్జరీకి నాలుగు గంటల సమయం పట్టింది సర్‌...’’ అని – నేను కళ్లు తెరవగానే ఒక యువ డాక్టర్‌ వచ్చి చెప్పాడు. ఆ యువకుడు నా కోసం ఏర్పాటైన డాక్టర్‌ పాండా టీమ్‌లోని సభ్యుడు. 
‘‘అవునా?!’’ అన్నాను, నిస్సత్తువ కనిపించ కుండా నవ్వుతూ చూస్తూ.

‘‘అవును సర్, ఇంకొక విషయం కూడా ఉంది. లోపల మీకు సర్జరీ జరుగుతున్నంత సేపూ కోకిలాబెన్‌
ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రి ముంబైలో ఉన్నట్లు లేదు. భువనేశ్వర్‌లో ఉన్నట్లుంది’’ అన్నాడు నవ్వేస్తూ.
ఆసుపత్రి బయటంతా నా కోసం ఒడిశా నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పటం అది. 

ఆ మాటతో నా నిస్సత్తువ కాస్త తగ్గింది. వయసులో ఉన్నవారు రుతుపవనాల్లా వచ్చి, పరిసరాల్లోని ‘వృద్ధ’ వాతావరణాన్ని అప్పటికప్పుడు ఉల్లాసంగా మార్చేసి వెళతారు. 
ఐసీయూ నుంచి నన్ను షిఫ్ట్‌ చేశాక, మళ్లీ కనిపించాడు ఆ యువ డాక్టర్‌. 

‘‘పట్నాయక్‌ సర్‌! ఉదయం నుంచీ నేను, నా... కో–డాక్టర్‌ మిస్‌ విభ మీ కోసం చూస్తూ ఉన్నాం...’’ అన్నాడు! 
‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. 
‘‘తను మీతో ఒక సెల్ఫీ కావాలని అడుగుతుంటే, ‘సరే ఇప్పిస్తాలే. నువ్విక్కడే ఉండు’ అని తనను బయటే నిలబెట్టి నేను లోపలికి వచ్చాను...’’ అన్నాడు. 

హాయిగా నవ్వాన్నేను. పిల్లలు పనిగట్టుకుని మన మనసుకు నచ్చినట్లుగా మాట్లాడాలని చూడరు. అసలు వాళ్లు మాట్లాడటమే మన మనసుకు నచ్చినట్లుగా ఉంటుంది.

వాళ్లు అలా మాట్లాడుతూనే ఉన్నారు... ‘‘పట్నాయక్‌జీకి శ్రీ మోదీ నుంచి ఫోన్‌...’’ అని చెప్పి డాక్టర్‌ పాండా ఆ యువ డాక్టర్లిద్దర్నీ నా రూమ్‌ నుంచి బయటికి పిలిపించుకున్నారు.

మోదీజీ లైన్‌లోకి వచ్చారు. ‘‘నమస్తే మోదీజీ...’’ అన్నాను. 
‘‘ఎలా ఉన్నారు నవీన్‌జీ...’’ అని ఫోన్‌లోనే రెండు నిమిషాల పాటు ఆయన నన్ను తన హృదయానికి గట్టిగా హత్తుకున్నారు. 

మునుపెన్నడూ ఫోన్‌లో ఆయన నన్నలా హత్తుకుని మాట్లాడినట్లుగా నాకు అనిపించ లేదు. బహుశా అప్పటివరకు నా గదిలో చల్లటి మాటలను వీచి వెళ్లిన ఆ రెండు యువ పవనాల మహత్యం అనుకుంటాను!! 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)