Breaking News

గ్రీన్‌కార్డు ఆంక్షలు.. భారత్‌ ముందు కీలక ప్రశ్న!

Published on Wed, 10/28/2026 - 15:38

అమెరికాలో గ్రీన్‌ కార్డుల జారీ నిలిచిపోవడం, పీఈఆర్‌ఎమ్‌ (పోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌) నిబంధనలు కఠినతరం కావడం వంటి పరిణామాలు భారతీయ ఐటీ నిపుణుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఆర్థికంగా, సామాజికంగా పెద్ద సవాలుగా మారవచ్చు. అయితే, అమెరికా గ్రీన్‌ కార్డులన్నింటినీ శాశ్వతంగా నిలిపివేసిందని లేదా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అడోబ్, టీసీఎస్‌ వంటి సంస్థల ఉద్యోగులందరినీ నిషేధించిందని భావించడం సరికాదు. కాబట్టి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటూనే భవిష్యత్తు పరిణామాలను విశ్లేషించాలి.

అమెరికా ప్రభుత్వం ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం స్థానిక ఉద్యోగాల రక్షణ, వేతనాలపై ఒత్తిడిని తగ్గించడం, వలస విధానాన్ని కఠినతరం చేయడం. అమెరికా సాంకేతిక రంగ అభివృద్ధిలో భారతీయ నిపుణుల పాత్ర గణనీయమైనది. వలసలను అతిగా పరి మితం చేస్తే ప్రతిభావంతుల కొరత ఏర్పడి, అమెరికా సంస్థల పోటీతత్వంపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఈ పరిణామాల్లో అత్యధికంగా ఆందోళన చెందు తున్నవారు గ్రీన్‌ కార్డు కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులు. ఇల్లు కొనడం, పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు, రుణాల చెల్లింపులు వంటి బాధ్యతల మధ్య గ్రీన్‌ కార్డు ప్రక్రియ ఆలస్యమైతే వారి భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతుంది.  

పీఈఆర్‌ఎమ్‌ అనేది అనేక ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డు దరఖాస్తుల్లో అవసర మయ్యే ఒక దశ మాత్రమే. దాని ప్రక్రియ నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉద్యోగం వెంటనే పోతుందని లేదా హెచ్‌–1బీ వీసా స్వయంచాలకంగా రద్దవుతుందని అర్థం కాదు. ఒకవేళ పెద్ద సంఖ్యలో భారతీయ టెకీలు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తే, భారతదేశం ముందు ఒక కీలకమైన ప్రశ్న నిలుస్తుంది: వారి అనుభవాన్ని దేశాభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలి?

ఇదీ చ‌ద‌వండి: హ‌వ్వా.. కాలేజీల్లో సినిమా ప్ర‌మోష‌న్లా?

వీరిని దేశానికి విలువైన మానవ వనరులుగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీ పరిశ్రమలు కలిసి... తిరిగి వచ్చిన నిపుణుల నైపుణ్యాలను నమోదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మరోవైపు, ఈ పరిస్థితి భారతదేశానికి ఒక అవకాశంగా కూడా మారవచ్చు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె వంటి సాంకేతిక కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, ఉత్పత్తి అభివృద్ధి, పరిశోధన రంగాల్లో అధిక నైపుణ్య ఉద్యోగాలను పెంచితే, అంతర్జాతీయ అనుభవం ఉన్న భారతీయులను స్వదేశంలోనే నిలుపుకోవచ్చు. విదేశాలకు వెళ్లిన ప్రతిభను తిరిగి రప్పించడం మాత్రమే విజయం కాదు; ఆ ప్రతిభ దేశంలోనే అభివృద్ధి చెందేలా అవకాశాలను నిర్మించడమే అసలైన విజయం.

– సిహెచ్‌.వి. ప్రభాకర్‌ రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)