Breaking News

సజ్జనుడు – దుర్జనుడు

Published on Mon, 07/13/2026 - 13:04

జీవశాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన పోలికతో ఆరిషడ్వర్గాలను వ్యాఖ్యానించవచ్చు. అరిషడ్వర్గాలు దుష్టుడికి ‘ప్రొటో– ఆంకోజీన్స్‌’ లాంటివి. మొదట సాహచర్యం చేస్తాయి, తర్వాత మార్పుచెంది అజమాయిషీ చేయడం మొదలుపెడతాయి. చివరకు ప్రాణాధారంగా మారతాయి.

ఆరోగ్యకరమైన కణంలో ‘ప్రొటో–ఆంకోజీన్స్‌’ అనేవి కణ విభజనను నియంత్రించే ప్రొటీన్లను తయారుచేసే జన్యువులు. కొన్ని సంకేతాలు అందుకున్నప్పుడు ఈ జన్యువులు క్రియాశీలమై, ఆ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి కణాన్ని విభజనకు ప్రేరేపిస్తాయి. పని పూర్తయ్యాక మళ్ళీ నిష్క్రియగా మారతాయి. ఈ జన్యువులు ప్రతి కణంలోనూ ఉంటాయి.

కామ–క్రోధ–లోభాది ఆరు మనిషి సహజ ప్రవృత్తులు (షడ్వర్గాలు) కూడా అంతే. ఇవి సజ్జనులలోనూ, దుర్జనులలోనూ ఉంటాయి. అవి శ్రుతిమించినప్పుడే సమస్య. ఆరోగ్యకరమైనకణంలో ప్రొటో– ఆంకోజీన్‌ ఎలా అవసరమైనప్పుడు నియంత్రణ మేరకు పనిచేసి, ఆ తర్వాత మౌనం వహిస్తుందో... అలాగే సజ్జను లలో షడ్వర్గాలు నియంత్రణకు లోబడి ఉంటాయి. నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే చెడు మార్పు మొదలవుతుంది.

నియంత్రణ తప్పడమే మ్యుటేషన్‌ ఈ నియంత్రణ తప్పడాన్నే జీవశాస్త్రంలో మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ప్రొటో–ఆంకోజీన్‌ మ్యుటేషన్‌ చెందినప్పుడు రూపాంతరం చెంది ఆంకోజీన్‌గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, జన్యువు పనిచేసే స్థితిలో (ఫంక్షనల్‌ స్టేటస్‌)లో కలిగే నిజమైన మార్పు కూడా. దాని పర్యవసానంగా కణం మొత్తం గుర్తింపు (ఐడెంటిటీ) మారిపోతుంది. అంటే ఆరోగ్య కరమైన కణం, క్యాన్సర్‌ కణంగా మారుతుంది.

షడ్వర్గాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నియంత్రణ తప్పిన మనిషిలో, గుణాలు అరిషడ్వర్గాలుగా పరిణమిస్తాయి: షడ్వర్గ సహిత మనిషి సజ్జనుడు, అరిషడ్వర్గ సహిత మనిషి దుర్జనుడు! దుర్జనుడు ఈ అరిషడ్వర్గాల నియంత్రణలోనే నడుస్తాడు. వీటి ప్రేరణతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అవే అతనికి శక్తినిచ్చే ప్రేరకాలు. అంటే ఇప్పుడు అరిషడ్వర్గాలు యజమానులుగా మారా యన్నమాట!

ఈ యజమానిత్వం కూడా ఒక మజిలీయే, గమ్యం కాదు. జీవశాస్త్రంలో దీనికి ‘ఆంకోజీన్‌ ఎడిక్షన్‌’ అనే పేరుంది. కణంలో అనేక ఇతర జన్యుపరమైన లోపాలు పోగుపడినా, ఆ కణం తన మనుగడ మొత్తాన్నీ ఒక్క మార్పు చెందిన (మ్యుటేటెడ్‌) ఆంకోజీన్‌ మీదే ఆధారపడేలా చేసుకుంటుంది. ఆ ఒక్క జన్యువుని నిరోధిస్తే చాలు, కణం మొత్తం నశిస్తుంది. దుష్టుడి స్థితి కూడా ఇదే. అరిషడ్వర్గాలే వాడికి శక్తినిచ్చి నడిపే జీవాధారాలుగా నిలుస్తాయి. వాటిని అదుపుచేస్తే సహజ స్థితిని పొంది సజ్జనుడు కాగలడు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే గుణాల మూలతత్త్వం ఒక్కటే. గుణం ఎప్పటికీ మారదు, దాని స్వరూపం స్థిరంగానే ఉంటుంది. మారేది దాని నియంత్రణ స్థితి మాత్రమే. ఈ స్థితి మారడం వల్లే మనిషి స్వరూపం మారిపోతుంది. ప్రోటో–ఆంకోజీన్‌... ఆంకోజీన్‌గా మారి కణాన్ని క్యాన్సర్‌ కణంగా మార్చి నట్టే, షడ్వర్గాలు అరిషడ్వర్గాలుగా మారి సజ్జనుడిని దుర్జనుడిగా మారుస్తాయి. మనిషి స్వభావాన్ని నియంత్రించే శక్తి ఏది అనేది ఒక తాత్త్విక ప్రశ్న. పురాణాలు, ఉపనిషత్తులలో చెప్పిన ఎన్నో విషయా లను ఆధ్యా త్మిక ధోరణిలోనే కాకుండా సామాజిక కోణంలోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ వ్యక్తిగత ఉన్నతికి ఉత్ప్రేరకాలుగానూ విశ్లేషించి ఆచరించే ప్రయత్నం చేస్తే వ్యక్తులు, సమాజం అభివృద్ధిపథంలో పయనించగలరు.
- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)