Breaking News

వైద్యుల దుఃస్థితికి ప్రతీక!

Published on Fri, 08/16/2024 - 13:41

కోల్‌కతా నగరంలో ఆర్‌జీ కార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి, తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహించాల్సి వస్తోందో ఇంకోసారి తేటతెల్లం చేసిన ఘటన ఇది. ఆ పీజీ వైద్య విద్యార్థి 36 గంటలుగా విధుల్లో ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కాసేపు సెమినార్‌ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణానికి బలయ్యారు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరియైన వెలుతురు లేని క్యాంపస్‌... ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.

ఇది వ్యవ స్థాగత లోపం. మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్య రంగంలో పనిచేస్తున్న వారు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడుతున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థలో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణభయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా, ప్రభుత్వం కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.

హత్యాచారం జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ రిపోర్ట్‌ ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి  ప్రభుత్వం ఆయనకు వేరే చోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవించింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెలవుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యాయం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వాత కూడా అక్కడి ప్రభుత్వం కోర్టు చెబితే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం. ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు వైద్యుల, ఆరోగ్య సిబ్బంది... రక్షణకు, భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి. వారు పనిచేసే స్థలం పూర్తి సేఫ్‌ జోన్‌గా ఉండాలి. – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)