Breaking News

అంతిమంగా రష్యాకు మేలు...

Published on Mon, 12/01/2025 - 00:31

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని విరమించేందుకు 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో యుద్ధం ఆగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఉక్రెయిన్‌ ‘నాటో’ సభ్యత్వం స్వీకరించకూడదనేది.  అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో ‘నాటో’ స్థావరాలను స్థాపించి మాస్కో పొలిమేర్ల వరకూ అమెరికా మిలిటరీ క్షిపణుల్ని మోహరించే ప్రయత్నంలో భాగంగా ‘నాటో’లో సభ్యత్వానికి ఉక్రెయిన్‌ను ప్రోత్సహించాయి. దీంతో తన ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగింది రష్యా.

ఉక్రెయిన్‌ తూర్పు భాగంలో 25 శాతం భూభాగాన్ని రష్యన్‌ సేనలు ఆక్రమించాయి. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మిత్రులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఉక్రెయిన్‌ ప్రధాన పట్టణాలను ఆక్రమించి రాజధాని కీవ్‌ దిశగా రష్యన్‌ సేనలు దూసుకెళుతున్నాయి. ‘మీరు శాంతియుతంగా లొంగకపోతే ఉక్రెయిన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామ’ని రష్యా హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో యుద్ధాన్ని ప్రోత్సహించిన అమెరికాయే ఇప్పుడు ట్రంప్‌ రూపంలో శాంతి ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి, ఉక్రెయిన్‌ ఓటమి నుంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తోంది. 28 శాంతి ప్రతి పాదనల్లో ప్రధానంగా 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పాన్ని వాస్తవ రష్యన్‌ నియంత్రణ ప్రాంతంగా గుర్తించి... అమెరికా గుర్తింపుతో సహా అంతర్జాతీయ గుర్తింపును పొందేలా చూడాలి. యుద్ధంలో రష్యా వశపరచుకున్న డొనెట్‌స్క్‌ పొరుగున ఉన్న లుహాన్‌స్క్‌ ప్రాంతాలను రష్యాకు ఇవ్వాలి. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ ఇవ్వాలి. అక్కడ మిగిలి ఉన్న ఉక్రెయిన్‌ ట్రూపులను వెనుకకు పిలవాలి. ‘నాటో సభ్యత్వాన్ని కోరను’ అని ఉక్రెయిన్‌ చేయాలని చెబుతున్న ప్రతిజ్ఞను ఈ శాంతి ముసాయిదాలో చేర్చారు. 

ఇందుకోసం ఉక్రెయిన్‌ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. ప్రతిఫలంగా ఉక్రెయిన్‌ భద్రతా హామీలను పొందుతుంది. ఉక్రెయిన్‌లో విదేశీ మిలిటరీ స్థావరాలు కానీ, దూరపు శ్రేణి క్షిపణులను కానీ మోహరించ కూడదు. ఉక్రెయిన్‌ ఆర్మీని 6 లక్షలకు మించకుండా కుదించడం, ‘నాటో’ ఇకపై రష్యా వైపు విస్తరించదనీ, రష్యా ఇకపై పొరుగు దేశాలపై దాడి చేయకూడదనీ ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఉక్రెయిన్‌ పారిశ్రామిక వాడలన్నీ రష్యా స్వాధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్‌ అణుశక్తిగా ఎన్నటికీ ఉండ కూడదు. యుద్ధ నష్టపరిహారం వంటివి ఇరువైపులా ఉండవు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేసి, 2014లో తొలగించిన జీ8 దేశాల కూటమిలో సభ్యత్వం తిరిగి ఇస్తారు. ఉక్రెయిన్‌లో 100 రోజులలోగా అధ్యక్ష ఎన్నికలు జరగాలి. 

యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు మాత్రం ఈ శాంతి ప్రణాళిక కోసం తమతో సంప్రదించలేదనీ, ఇది రష్యా అనుకూల ప్రణాళిక అనీ అంటున్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ ప్రతిపా దనల్ని ఒప్పుకొని ఉంటే యుద్ధమే ఉండేది కాదు. ఇంత విధ్వంసమే జరిగేది కాదు. లక్షలాది మంది పశ్చిమ యూరప్‌కు వలసలు పోయేవారు కాదు. ఐతే బ్యాంకుల్లో స్తంభించిన 30,000 కోట్ల డాలర్ల రష్యా కరెన్సీ గురించి ఇంకా స్పష్టత రాలేదు. 

శాంతి ఒడంబడిక జరిగితే అంతిమ విజేతగా రష్యా నిలవనుంది. రష్యాను బలహీనపర్చి, రష్యాను విభజించి వలస దేశంగా మార్చి ఖనిజసంపదను దోచుకోవాలన్న అమెరికా, పశ్చిమ దేశాల ఆశలు అడియాసలుగా మిగిలిపోతాయి.పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ దిగజారుడులో ఉంది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్తూ ఐఎంఎఫ్‌ నుంచి ఆర్థిక సహాయానికి కూడా వెళ్లాలనే ఆలోచనలో యూకే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపటం ద్వారా అమెరికా, మిత్రదేశాలు తమ పరువును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నాయనడం సముచితం.


బుడ్డిగ జమిందార్‌  
వ్యాసకర్త ‘ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం’
జాతీయ కార్యవర్గ సభ్యులు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)