దేశానికే ఆదర్శంగా

Published on Wed, 01/03/2024 - 07:55

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో సెల్‌ ఫోన్‌... అరచేతుల్లో ప్రపంచాన్ని చూపిస్తూ మనిషిని కట్టిపడేస్తోంది. దీంతో ఏ కొద్ది తీరిక ఉన్నా జనం మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. కనీసమైన వ్యాయామాన్ని చేయడంలేదు.

ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. తద్వారా గ్రామీణ స్థాయిలోనే అనేకమందిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను బయట పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 15 సంవత్సరాల పిల్లల నుంచి ఆ పైన ఉన్న అన్ని వయసుల వారికీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నది ప్రభుత్వం. అన్ని గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ బిజీ జీవితానికి స్వస్తి చెప్పి ప్రస్తుతం ఆటల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఏ విధమైన శారీరక శ్రమ, సరైన వ్యాయామం లేకుండా బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్న కోట్లాదిమందికి మరోసారి చిన్నప్పటి క్రీడానందాన్నీ, ఉత్సాహాన్నీ ఈ క్రీడలు కలిగిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో ప్రజలు మునిగి తేలుతూ ఉన్నారు. మునుముందు రోజుల్లో మరింతమంది క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్‌ నుండి మరీ ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులను ప్రోత్సహించడానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి.

సుమారు 35 లక్షల మంది యువతీ యువ కులు ఈ క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వారందరి ఆటలనూ  సుమారు 90 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించి సంతో షిస్తున్నారు. ఈ విధంగా క్రీడలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఈ క్రీడా ఉత్సవాలు కొనసాగడానికి ప్రజలు తమ వంతు అండదండలు అందించడం అవసరం.  – నాగెండ్ల సుమతీ రత్నం, దాచేపల్లి 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)