Breaking News

14వ దలై లామా (బౌద్ధ గురువు) రాయని డైరీ

Published on Sun, 12/29/2024 - 06:03

‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. 

అయితే ఒక బౌద్ధ గురువు ఇలాంటి ఒక దైహికమైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ఆ గురువు ఇచ్చే సమాధానం... ప్రశ్న వేయటానికి వెనుక ఉన్న ఉద్దేశంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండాలి. 

అంటే... ఆయన ధర్మశాల పట్టణంలోని తన హిమాలయ నివాసంలో ఉన్నా, న్యూయార్క్‌లోని మోకాళ్ల శస్త్ర చికిత్సా కేంద్రంలో ఉన్నా సమాధానం మారకూడదు. అది కూడా, ‘‘నాకేం! నిక్షేపంగా ఉన్నాను’’ అని కాకుండా, ‘‘నీకేం! నిశ్చింతగా ఉండు’’ అని... భరోసా ఇచ్చేలా ఆ సమాధానం ఉండాలి. 

బౌద్ధాచార్యులైన ఒక దలై లామా  ఎంతటి వృద్ధాప్యంలోనైనా ‘గుంభనం’గా ఉన్నప్పుడే ఆయన భక్తులు, అనుచరులు, పాలకులు ఆయన అంతిమ శ్వాసను గురించిన ఆలోచనలు చేయకుండా ఉంటారు.

జూన్‌లో శస్త్ర చికిత్స జరిగాక నా మోకాలి కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. నలుగురు కలిసి నడిపిస్తే నడవ గలుగుతున్నాను. ఇద్దరు కలిసి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నాను.

ప్రపంచానికైతే నాకసలు చికిత్స జరిగింది కుడి కాలికా, ఎడమ కాలికా అన్న సంగతే తెలియదు. అదే ‘గుంభనత్వం’ అంటే! ఎవరికీ, ఏదీ తెలియనివ్వకపోవటం! ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి! 

దర్శనాలకు సమయమౌతుండగా మిస్‌ డోల్మా త్సెరింగ్‌ తేఖాంగ్‌ వచ్చి, ‘‘ఎలా ఉన్నారు ఆచార్యా?’’ అని నన్ను పరామర్శించారు! ఆమె అలా మంద్రస్థాయిలో ఇటీవల కొంతకాలంగా నన్ను పరామర్శిస్తూ వస్తున్నారు!

‘‘ఎందుకు మీరలా పదే పదే సందేహిస్తున్నారు మిస్‌ తేఖాంగ్‌?’’ అన్నాను. ధర్మశాలలోని ప్రవాస టిబెటన్‌ ప్రభుత్వ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్‌ ఆమె.

వచ్చే ఏడాది జూలై 6కు నాకు 90 ఏళ్లు నిండుతాయన్న ఆలోచన... ఆరామంలోని అందరితో పాటుగా మిస్‌ తేఖాంగ్‌నూ హృదయ శూన్యతకు గురిచేస్తోందా?! లేక, మునుపటి దలైలామా 57 ఏళ్లకే పరమపదించటం వల్ల, అది ఊహించుకుని ఆమె కలత చెందుతున్నారా?!

‘‘ఇప్పటిలా వారానికి మూడుసార్లు కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే సందర్శకులను అనుమతించటం వల్ల మీకు మరికాస్త విశ్రాంతి దొరుకుతుందని సిక్యోంగ్‌ పెన్పా త్సెరిన్‌ తలపోస్తున్నారు ఆచార్యా’’ అన్నారు తేఖాంగ్‌. 

సిక్యోంగ్‌ పెన్పా త్సెరిన్‌... ప్రవాస టిబెటన్‌ ప్రభుత్వ ప్రధాని. 
‘‘వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరమే మిస్‌ తేఖాంగ్‌. కానీ కలలకు వృద్ధాప్యం ఉంటుందా?! నా కల ప్రకారం నేను 110 సంవత్సరాలు జీవించబోతానని మునుపు నేను చెప్పిన మాటనే ఇప్పుడూ చెబుతున్నాను. మీరూ, మీ ప్రధానే నా కలపై విశ్వాసం లేక చింతాక్రాంతులై ఉన్నట్లున్నారు. నేనెలా ఉన్నాను అనే దానికన్నా, నా తర్వాత ఎవరున్నారు అన్నదే మీ
ఆందోళనగా నాకు కనిపిస్తోంది’’ అన్నాను చిరునవ్వుతో. 

తేఖాంగ్‌ కలవరంగా చూశారు. 
‘‘ఆచార్యా... మేము కేవలం సామాన్యులం.
మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అందువల్లనే మీరేమైనా చెబుతారేమోనని ఎదురు
చూస్తున్నాం...’’ అన్నారు మిస్‌ తేఖాంగ్‌!  

నాకర్థమైంది. వారు నా పునర్జన్మ కోసం చూస్తున్నారు! 15వ దలైలామా ఆగమనం కోసం నిరీక్షిస్తున్నారు. 
కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే – మరణించాక మాత్రమే పునర్జన్మ ఉండదనీ, కర్తవ్య నిర్వహణ కాంక్ష అన్నది ఒకే జన్మలో అనేక పునర్జన్మల్ని ప్రసాదిస్తుందనీ!

‘‘నా దగ్గరింకా 20 హ్యాపీ న్యూ ఇయర్‌లు
మీ అందరి కోసం మిగిలే ఉన్నాయి మిస్‌ తేఖాంగ్‌. ధీమాగా ఉండండి...’’ అని ఆమెతో నవ్వుతూ చెప్పాను. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)