Breaking News

కూర్గ్‌ అందాలు.. అక్కడ తప్పక చూడాల్సిన ప్రాంతాలివే

Published on Wed, 04/12/2023 - 16:44

వేసవి కాలం వచ్చేసంది. ఈ ఎండలో చల్ల చల్లగా ఉపశమనం కోసం పర్యటక ప్రియులంతా సమ్మర్‌ వెకేషన్‌ కోసం ప్లాన్‌ చేస్తుంటారు. సమ్మర్‌ వెకేషన్ అనగానే అందరి టక్కున గుర్తొచ్చేది నార్త్‌ టూర్‌. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్‌లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్‌ ఒకటి. సౌత్‌ టూర్‌ అనగానే అందరికి అరకులోయ, ఊటీ, కన్యాకుమారి ఇలా గుర్తొస్తాయి. కానీ దక్షిణ కర్ణాటకలోని ఈ కూర్గ్‌ ప్రాంతం చాలా తక్కువ మందికి తెలుసు.

  భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్‌ స్టేషన్‌ ఇక్కడి ప్రత్యేకం. దీనిని ఇండియన్‌ స్కాట్లాండ్‌ అని కూడా పిలుస్తారు. అత్యంతక సుందరమైన, ఆకర్షనీయమైన పర్వతపాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇవి మాత్రమే ఇక్కడ ఇంకా కూర్గ్‌లో చూడాల్సిన అందమైన ప్రాంతాలేన్నో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలేవో ఓ సారి చూద్దాం. 

అబ్బే జలపాతం
కూర్గ్‌ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది.  కాఫీ తోటల మధ్య ఉండే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి పర్యాటక ప్రియులు క్యూ కడుతుంటారు . కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరచూ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

నాగర్‌హొళె జాతీయ పార్క్‌
ఈ ఉద్యానవనంలో అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలు, జంతువులు దర్శనం ఇస్తుంటాయి. ఆ కారణంగా నాగర్‍హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి.

హనీ వాలి 
హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్‌ స్పాట్‌. ఇక్కడ ముఖ్యంగా ట్రెక్కింగ్‌, అత్యుత్తమ సాహస క్రీడలు ప్రసిద్ధి. 

హొన్నమన కెరె లెక్‌
కూర్గ్‌ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. సరస్సు సమీపంలోని ఆలయంలో జరుపుకునే గౌరీ పండుగ సమయంలో సరస్సును ప్రత్యేకంగా సందర్శిస్తారు. 

సోమవారపేట్ 
సోమవారపేట్‌ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు,  మిరియాలు. ఇక్కడి పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం.

నామ్‌డ్రోలింగ్ ఆరామం
ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్‌ ఒకటి. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఆకర్షణీయంగా ఉంటుంది. విభిన్న శైలిలో కట్టడంగా ప్రసిద్ధి గాంచిన నామ్‌డ్రోలింగ్‌ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఓంకారేశ్వర ఆలయం
ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.   

మడికెరి కోట
బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)