Breaking News

టాప్‌ 10 ఇండియన్‌ యూట్యూబర్స్‌ లిస్ట్‌లో.. 'శ్రుతి అర్జున్‌ ఆనంద్‌'!

Published on Sun, 07/14/2024 - 01:59

శ్రుతి.. ఉత్తరప్రదేశ్, ఝాన్సీలో పుట్టిపెరిగింది. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. మేకప్, ఫ్యాషన్‌ అంటే చాలా ఆసక్తి. అందుకే తన తొలి వీడియోను వాటి మీదే అంటే.. హెయిర్‌ స్టయిల్స్‌ మీదే తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. అప్పుడు ఆమె అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది.

ఆ వీడియోకు ఆమె ఊహించని రీతిలో వ్యూస్, షేర్స్‌ వచ్చాయి. ఆ ప్రోత్సాహం, ఉత్సాహంతో ‘ShrutiArjunAnand’ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ను స్టార్ట్‌ చేసింది. 2013లో ఆమె ఇండియా వచ్చేవరకు ఆ చానెల్‌లో ఎక్కువగా ఫ్యాషన్‌ కంటెంట్‌ వీడియోలే అప్‌లోడ్‌ అయ్యేవి. ఇండియా వచ్చేశాక యూట్యూబ్‌ చానెల్‌ మీద ఫుల్‌ టైమ్‌ వర్క్‌ చేయడం మొదలుపెట్టింది.

డే టు డే లైఫ్‌లోని పరిస్థితులు, కుటుంబ విషయాలను కథానాంశాలుగా తీసుకుని కామెడీ టచ్‌తో వీడియోలుగా తీసి తన చానెల్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది. తన చానెల్‌కున్న లక్షల వ్యూస్, మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌తో ఆమె  2016లోనే టాప్‌ 10 ఇండియన్‌ యూట్యూబర్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు శ్రుతి.. దేశంలోకెల్లా రిచెస్ట్‌ యూట్యూబర్స్‌లో ఒకరు.

ఒక్క శ్రుతే కాదు ఆమె భర్త అర్జున్, కూతురు కూడా టాప్‌ యూట్యూబర్సే. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబమంతా యూట్యూబర్సే. ‘ShrutiArjunAnand Digital Media’ ప్రైవేట్‌ లిమిటెడ్, ‘Shruti Makeup & Beauty’ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రెండు కంపెనీలను స్థాపించి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసి పనిచేస్తూ సోషల్‌ మీడియా వ్యూయర్స్‌ నచ్చే.. మెచ్చే కంటెంట్‌ని క్రియేట్‌ చేస్తోంది శుత్రి అర్జున్‌ ఆనంద్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)