Breaking News

ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు!

Published on Fri, 10/31/2025 - 13:57

ఒకేసారి రెండు స్కిల్స్‌ని ప్రదర్శించడం మాటలు కాదు. అది కూడా సంగీతాన్ని, స్మిమ్మింగ్‌ని మిళితం చేస్తూ..ప్రదర్శించడానికి ఎంతో ప్రాక్టీస్‌ ఉండాల్సిందే. లేదంటే నీటిలో తేలుతూ..సంగీత వాయిద్యా పరికరాలను వాయించడం అంత సులువు కాదు. అదికూడా రివర్స్‌(బ్యాక్‌ స్టోక్‌)తో ఈత కొడుతూ వాయిద్యడం అంత ఈజీ కాదు.  కానీ ఈ యువకుడు ఆ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రికార్డు సృష్టించాడు. 

ఈ ఘనతను సృష్టించింది బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మ్యూజిక్‌ టీచర్‌ రూబెన్‌ జాసన్‌ మచాడో. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజ్‌ స్విమ్మింగ్ పూల్‌లో 700 మీటర్లకు పైగా వెనుకకు(బ్యాక్‌స్ట్రోక్) ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ ఈ 30 ఏళ్ల సంగీతకారుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును క్రియేట్‌ చేశాడు. ఉదయం పదిగంటలకు బ్యాక్‌స్ట్రోక్‌ ప్రదర్శనను ప్రారంభించి..150 మీటర్లు వరకు ఈత కొడితే చాలన్నుకున్నాడట.

 కానీ అనుహ్యంగా 700 మీటర్ల వరకు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌(GBWR)లకెక్కాడు. ఈ మేరకు GBWR రూబెన్‌కి అధికారిక సర్టిఫికేట్‌ను అందజేసింది. తన తండ్రి సూచన మేరకు ఈ వినూత్న రికార్డుని ప్రయత్నించానని చెబుతున్నాడు రూబెన్‌ జాసన్‌

ఎవరీ రూబెన్‌ జాసన్‌..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సేఫ్టీ (NIWS) ధృవీకరించిన లైఫ్‌ సేవర్‌ రూబెన్‌కు హిందూస్తానీ, వెస్ట్రన్‌ ఫ్లూట్‌ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే సాక్సోఫోన్‌, గిటార్‌, వంటి ఇతర వాయిద్యాలను వాయించడంలో దిట్ట. ఇక ఆయన బాలీవుడ్‌, శాండల్‌వుడ్‌, కోస్టల్‌  చిత్రాలలో పలు పాటలకు సంగీతం సమకూర్చారు. 

అంతేగాదు భారతదేశం అంతటా అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఆయన 2016 వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌లో కూడా పాల్గొన్నాడు. ఇక రూబెన్‌కు ఈ ఫ్లూట్‌ ప్రదర్శనలో సుమారు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం. 

(చదవండి: ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..)
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)