Breaking News

ఫిట్నెస్‌లో సరికొత్త ట్రెండ్‌

Published on Fri, 03/13/2026 - 10:11

నగరవాసులు శాకాహారులుగా మారుతున్నారు.. ఆహారంపై క్రమంగా పెరుగుతున్న అవగాహనతో అటువైపు అడుగులు వేస్తున్నారు. వేగవంతమైన లైఫ్‌స్టైల్‌కు కేంద్రమైన హైదరాబాద్‌లో.. ఓ వైపు మెట్రో పరుగులు, ఆఫీస్‌ డెడ్‌లైన్లు, పార్టీ కల్చర్, మరోవైపు వీకెండ్‌ హ్యాంగౌట్స్‌.. ఇవన్నీ కలిసి మన ఆహార అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఎప్పుడు, ఏమి, ఎంత తింటున్నాం అన్న ఆలోచన లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఫలితం.. డైట్‌ బ్యాలెన్స్‌ తప్పుతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. దీనికితోడు అడుగడుగునా రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్స్‌.. అంతేనా! మొబైల్‌ ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో.. నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వంటివి మన అలవాట్లను దెబ్బతీస్తున్నాయి. దీన్ని మార్చేందుకు కొందరు కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు..       

సిటీ ట్రెండ్స్‌ కారణంగా మన ఆహార అలవాట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పని ఒత్తిడి కారణంగానో.. అలసట కారణంగానో.. ‘ఈ రోజు వండుకోకపోతే ఏమైంది?’ అనే భావన సాధారణం అయ్యింది. ఉదయం అల్పాహారాన్ని తప్పించి కాఫీతో సరిపెట్టడం, లంచ్‌కు బిర్యానీ/ బర్గర్‌తో ముగించడం, రాత్రి ఆలస్యంగా హెవీ డిన్నర్‌.. ఇవన్నీ నగర యువతలో సాధారణ అంశాలు. వీటన్నింటినీ సమత్యుల్యం చేయడంపై దృష్టి సారిస్తున్నారు కొందరు నగరవాసులు. ఇందులో భాగంగా వెజ్‌ వీక్, లంచ్‌ బాక్స్‌ మంథ్‌ అంటూ కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు. 

నాన్‌ వెజ్‌ డామినేషన్‌? 
ఒకప్పుడు మాంసాహారం వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం చికెన్, మటన్, ఫిష్‌ పేర్లతో రోజుకో వెరైటీ మన ప్లేట్లో వచ్చి చేరుతోంది. ప్రొటీన్‌ పేరుతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. ఫైబర్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, కూరగాయల నిర్లక్ష్యం.. వంటి కారణాలతో ఊబకాయం, కొలె్రస్టాల్, షుగర్‌ వంటి రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా 25–40 ఏళ్ల వయసులోనే లైఫ్‌స్టైల్‌ రోగాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని అధిగమించేందుకు నిపుణుల సూచనల మేరకు కొందరు క్రమంగా శాకాహారంపై ఆసక్తి 
కనబరుస్తున్నారు.

నో ఔట్‌సైడ్‌ ఫుడ్‌ చాలెంజ్‌.. 
ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసుల్లో కొత్త అవేర్‌నెస్‌ కనిపిస్తోంది. పూర్తిగా డైట్‌ మార్చలేకపోయినా, కనీసం కొన్ని రోజులు నియంత్రణలో ఉండాలనే ప్రయత్నం పెరిగింది. ‘వెజ్‌ వీక్‌’, ‘వెజ్‌ మంథ్‌’ అంటూ కొన్ని రోజులు నాన్‌వెజ్‌కు బ్రేక్‌ పెట్టడం.. ఏడు రోజులు ‘నో ఔట్‌సైడ్‌ ఫుడ్‌’ చాలెంజ్, ఓన్లీ హోమ్‌ ఫుడ్‌’, రెగ్యులర్‌ లంచ్‌ బాక్స్‌.. వంటివి ట్రెండ్‌గా మారాయి. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి ‘హోమ్‌ ఫుడ్‌ డేస్‌’ ప్లాన్‌ చేయడం.. ఒకప్పటి స్కూల్‌ డేస్‌ను గుర్తు చేస్తున్నాయి. స్వయంగా వంట చేసుకునే యువత కూడా పెరుగుతోంది. రైస్, కూర, పప్పు, పెరుగు వంటి సింపుల్‌ మీల్స్‌ ఎంత ఆరోగ్యకరమో మళ్లీ అర్థమవుతోంది. దీనికి తోడు మీల్‌ ప్రిప్‌ కల్చర్, వారం రోజులు వంట సిద్ధం చేసుకోవడం వంటి కాన్సెప్‌్ట్స హైదరాబాద్‌లో పాపులర్‌ అవుతున్నాయి.

చిన్న ప్రయత్నం.. పెద్ద మార్పు.. 
అందరూ ఒక్కసారిగా ఫిట్‌ ఫుడ్‌కే మారాలి అనుకోవడం ఆచరణసాధ్యం కాకపోవచ్చు. కానీ వారానికి కొన్ని రోజులు కంట్రోల్డ్‌ డైట్, ఇంటి ఆహారానికి ప్రాధాన్యం, నాన్‌ వెజ్‌ను పరిమితంగా తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం.. ఇవే పెద్ద మార్పుకు పునాది. నగర జీవనశైలిలో ఫాస్ట్‌ ఫుడ్‌ తప్పదనిపించినా, ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తును కాపాడతాయనేది డైట్‌ నిపుణుల అభిప్రాయం.  


 

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు