Breaking News

యోగా : ఈ ఆసనంతో వెన్నుకు దన్ను

Published on Tue, 10/15/2024 - 10:24

వంగి పనిచేయడం, నిటారుగా ఉండటంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెన్నెముక కండరాలకు శక్తి అవసరం అని గుర్తించాలి. వెన్ను కండరాలను బలపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భుజంగాసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పొట్ట, హిప్‌ కండరాలను గట్టిపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. 

తాచుపాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఈ భంగిమ అలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్‌ అని, తెలుగులో భుజంగాసనం అంటారు.

  • యోగా మ్యాట్‌ పైన బోర్లా పడుకొని, చేతులను నడుము, హిప్‌ భాగానికి ఇరువైపులా ఉంచాలి. 

  • అర చేతులను నేలకు ఆనించి, భుజాలు, తల నెమ్మదిగా పైకి లేపాలి.

  • అరచేతులను నేలకు నొక్కి పట్టి ఉంచి, నెమ్మదిగా ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. దిగువ వీపుపై ఒత్తిడి పడకుండా వెనుక కండరాలను కొద్దిగా స్ట్రెచ్‌ చేయాలి.  

  • దీర్ఘ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి. 

  • శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ∙ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు. 

  • గర్భిణులు ఆ ఆసనం వేయకూడదు. 

  • శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నవారు, వయసు పైబడినవారు ఆ ఆసనాన్ని నిపుణుల సూచనల మేరకే సాధన చేయాలి.
    – జి.అనూష, యోగా గురు 
     

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)