ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..

Published on Fri, 08/14/2026 - 14:50

పాత్రికేయ రంగం అంటేనే సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఏది పడితే అది రాసే అవకాశం ఉండదు. అధికారులకు అననుకూలంగా రాసామో అంతే సంగతులు. అలాంటి రక్షణలేని వృత్తి ఇది. ఎప్పుడు మీడియా గొంతును నొక్కేసేలా దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉంటూనే ఉంటాయి. కానీ తొలిసారిగా మహిళల హక్కులు, ప్రకృతి విపత్తుల కోసం చాలా చురుకుగా ప్రపంచానికి తెలియజేసే ఓ ఫోటో జర్నలిస్ట్‌ జైలు పాలవ్వడమే కాదు ఎన్నే ఏళ్లు జైలు శిక్ష విధించారో తెలిస్తే కంగుతింటారు. పైగా పాత్రికేయరంగంలో ఇన్ని సవాళ్లు ఉంటాయా అనిపిస్తుంది. మంచి జరగాలని ప్రయత్నిస్తే మొత్తానికి వాళ్ల కథే ముగిసిపోతుంది అనేలా అయ్యింది ఈ జర్నలిస్ట్‌ పరిస్థితి.

ఇరాన్‌ దేశల్లో నిరసనలు, మహిళలు జీవితాలను డాక్యుమెంట్‌ చేయడంలో పేరుగాంచిన ఫోటో జర్నలిస్ట్‌కి జైలుపాలవ్వడమే కాదు ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2025లో ఇరాన్‌ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఈ శిక్షణు విధించింది. ఇది గూఢచర్యం, శత్రుదేశాల సహకారాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన చట్టం. ఆమెపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారనే ఆరోపణలతో టెహ్రాన్‌ కోర్టు ఈ శిక్ష విధించింది. 

ఆమె ఇరాన్‌ అధికారులకు ప్రతికూలంగా ఉండే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, యూఎస్‌ ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న సంస్థలకు ఫోటోలు అందించారని ఆరోపణలతో ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఇరాన్‌ అంతరంగిక వర్గాల సమాచారం. అంతేగాదు ఇంటెలిజెన్స్‌ వింగ్‌ సభ్యులు ఆమె ఇంటిపై దాడిచేసి, ల్యాప్‌టాప్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆమె కేసుకి సంబంధించిన కాఫీలు కూడా ఇవ్వకుండా కోర్టు ముందుంచి ఈ శిక్ష విధించడం గమనార్హం. 

ఇదిలా ఉండగా మోయిరీ ఇరాన్‌లో వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోల తోపాటు తన పనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా మోయిరీపై ఇరాన్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇదేమి ఆమెకు మొదటి జైలు శిక్ష కాదు, గతంలో ఘర్చక్ జైలులో రెండేళ్లు శిక్షఅనుభవించింది. అలాగే 2022లో, పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ" నిరసనలను కవర్ చేసినందుకు గానూ ఏకంగా ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించగా మూడేళ్లు శిక్ష అనుభవించి క్షమాభిక్ష అనంతరం విడుదలైంది. తాజాగా మరోసారి సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటుండటం గమనార్హం. 

(చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్‌..! అందం కోసం ఇంత పెయిన్‌ తప్పదా?)
 

#

Tags : 1

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)