Breaking News

రచయిత రాంబాబుగాడి సూపర్‌ సూపర్‌ సీన్లు! హీరో గారికి ఎలివేషన్లూ...!!

Published on Fri, 07/10/2026 - 08:02

రచయిత రాంబాబుతో స్టోరీ డిస్కషన్స్‌కు కూర్చున్నాడు డైరెక్టర్‌ వైవై చంద్రమౌళి. ఓ అద్భుతమైన మదర్‌ సెంటిమెంట్, రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో కూడిన ఫుల్‌ యాక్షన్‌ మూవీ కోసమే ఈ సిట్టింగ్‌. హీరోకు మంచి మంచి ఎలివేషన్లతో పాటు... హీరో మదర్‌తో ఓ సెంటిమెంట్‌ సీనూ, హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీనూ ఎట్సెట్రాలతో పాటు సినిమా అసలు థీమ్‌ కూడా చె΄్పాలని కోరాడు. అంతే... డైవ్‌ చేస్తున్నట్టుగా తన రచనలోకి ఎగిరి దూకాడు...  మా రాంబాబుగాడు.

హీరోగారి అమ్మతో సెంటిమెంట్‌ సీన్‌..
అమ్మకు జ్వరం. అర్జెంటుగా టాబ్లెట్‌ వేయాలి. పుక్కిలించడానికి వేణ్ణీళ్లూ కావాలి. కాస్త చాయ్‌ కూడా పెట్టివ్వాలి. హార్మూజ్‌ జలసంధిలో మన నౌకలు చిక్కుకోవడంవతో గ్యాస్‌ సిలెండర్ల కొరత! ఏం చేయాలో తోచలేదు మన హీరో పరాక్రమ్‌ రాథోడ్‌కి. మనసులో ఓ ఐడియా మెదిలింది. కాకినాడ సముద్రపు ఒడ్డున మన కేజీ బేసిన్‌లో అపార  గ్యాస్‌ నిల్వలు ఉన్న విషయం గుర్తొచ్చింది. అంతే... తమ ఇంటి బాల్కనీలోంచి ఓ పైప్‌ను అమాంతంగా విసిరాడు. అది కాస్తా వెళ్లి సముద్రప్పొరల్లో గ్యాస్‌ ఉన్న చోటికి దూసుకెళ్లింది. పైపు రెండో చివరను గ్యాస్‌ స్టవ్‌ దగ్గర అమర్చాడు పరాక్రమ్‌. అంతే... చాయ్‌ తయార్‌.... వేణ్ణీళ్లూ రెడీ. గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించి, చల్లటి నీళ్లతో టాబ్లెట్‌ వైసుకుని, వేడి వేడి చాయ్‌ తాగి సేదదీరింది హీరో వాళ్ల అమ్మ. ఆమె కళ్లనుంచి రెండు బొట్ల ఆనందబాష్పాలు! వేడిగా అవి హీరోను తాకడంతో ‘‘ఏంటమ్మా ఇదీ?’’ కాస్త కోపం నటిస్తూ అడిగాడు పరాక్రమ్‌.

‘‘ఇవి వెచ్చటి నా ఆ΄్యాయతా, గోరువెచ్చటి ఆపేక్ష రా. వాటికా వేడి ఎలా వచ్చిందో తెల్సా? కేజీ బేసిన్‌ నుంచి నువ్వు తెప్పించిన గ్యాస్‌తో కాచిన వేడి చాయ్‌ తాగాకే రా’’ వాత్సల్యంగా హీరో పరాక్రమ్‌ తల నిమురుతూ చెప్పింది అమ్మ.

హీరోయిన్‌తో డ్యూయెట్‌ కోసం ప్రిపరేటరీ సీన్‌..
హీరోయిన్‌ తలస్నానం చేసి తలారబెట్టుకుంటోంది. పొడవాటి కురులు కావడంతో  ఒక పట్టాన జుట్టు ఆరడం లేదు. హీరోయిన్‌ విసుక్కోవడం వినిపించింది పరాక్రమ్‌కు. అంతే... మూణ్ణాలుగు హెలికాప్టర్లు హీరోయిన్‌ చుట్టూ ఏటవాలుగా రౌండు రౌండుగా రౌండ్లు కొడుతూ తమ నెత్తిమీది ఫ్యాన్ల గాలి హీరోయిన్‌ నెత్తిమీది కురులకు తగిలేలా తిరుగాడసాగాయి. హీరోయిన్‌ హీరోవైపు మెచ్చుకోలుగా, ఆరాధనగా, గోముగా... ఇత్యాది అనేక భావాలతో చూసింది. అంతే... ఆ వెంటనే సాంగుకు అవసరమైన సిచ్యువేషన్‌ రెడీ!

హీరో: చాపర్‌ గాలికి ఆరేనా... కాపర్‌ గోల్డ్‌ నీ కురులు
హీరోయిన్‌:    ఆఫర్‌ చేస్తా నీలాలు... కప్పుకో జోరుగా తడికేశాలు 
హీరో: లేజర్‌లాంటి కళ్లతో సూపర్‌గా నన్ను చూడకలా
హీరోయిన్‌: గ్లేజర్‌లా నువ్వు అదేపనిగ పొగడకిలా.... అంటూ సాంగ్‌ షురూ!

సినిమా స్టోరీ అండ్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌..
హీరో ఓ గూఢచారి. హీరోయిన్‌ అన్న కూడా మన హీరో ఫ్రెండే. అతడు హార్మూజ్‌ జలసంధిలో చిక్కుకున్న ఒక ఓడలో డ్యూటీ చేస్తున్నాడు. ఆ షిప్పును బాంబులతో పేల్చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలిసింది. తన అన్నను రక్షించమని కోరింది హీరోయిన్‌. అంతే... తన ఫ్రెండును రక్షించుకోడానికి బయల్దేరాడు హీరో.
‘‘సముద్రంలో ఎక్కడో చిక్కుకున్న ఓడ వరకు హీరో చేరాలి. ఎలా?’’ అడిగాడు డైరెక్టర్‌ వైవై చంద్రమౌళి.

‘‘ఓ పని చేద్దాం సార్‌. గతంలో ఎప్పుడో వలలో చిక్కుకున్న ఓ డాల్ఫిన్‌ని హీరో రక్షిస్తాడు. నీళ్లలోకి దూకి ్రపాణాలకు తెగించి సముద్రంలో ఈదుతూ ఆ వలను కత్తితో కోస్తాడు. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు తన అనుచరులందరినీ మంద మందగా తీసుకొస్తుంది మెయిన్‌ డాల్ఫిన్‌. సముద్రంలో ఈదుతూ ఒకదాని తర్వాత ఒకటిగా పైకి వస్తూ... నీళ్ల మీద వాటి వీపులు బయటికొచ్చేలా ఫాస్ట్‌గా వెళ్లిపోతుంటాయి డాల్ఫిన్లు. హీరో ఆ వీపుల మీద అడుగులేస్తూ పరుగులు పెడతాడు. సరిగ్గా హీరోగారు గబగబా కాలేసే చోటే సర్ఫేస్‌ అవుతూ హీరోను చకచకా ఓడ వరకు చేరుస్తాయవి. హీరోయిన్‌ అన్నను రక్షించాక ఆ ఇద్దరూ ఒడ్డుకు మళ్లీ అలాగే చేరతారు. హీరోయిన్‌ కూడా సముద్రపు ఒడ్డుకు వచ్చి వాళ్లతో కలిసి అలా జాగింగ్‌ చేస్తున్నట్టు పరుగెడుతుండగా... వైవై చంద్రమౌళి అనే రౌండు రబ్బర్‌స్టాంపు తెరపై బలంగా పడుతుండటమే క్లైమాక్స్‌’’ అంటూ యాక్షన్‌ సీక్వెన్స్‌ వివరించాడు రాంబాబు.

సీన్లు విన్న నెక్స్‌ట్‌ మొమెంట్‌... సిట్టింగ్‌లోని వారు తమ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అమాంతంగా కృష్ణానగర్‌ వైపుగా కొందరు, ఫిల్మ్‌నగర్‌ వైపు మరికొందరు పారిపోవడం కనిపించింది.
– యాసీన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)