Breaking News

ఈ భూగర్భ వాణిజ్య కేంద్రం గురించి మీరెప్పుడైనా విన్నారా!?

Published on Sun, 04/28/2024 - 13:42

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్‌ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.

ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.

హంట్‌ మిడ్‌వెస్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్‌ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్‌’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్‌ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.

ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్‌ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇవి చదవండి: అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)