Breaking News

రంగురంగుల సాలెగూడు!

Published on Sun, 08/31/2025 - 13:29

ఒక్కసారి ఊహించండి! సాలీడు అల్లిన గూడు తెల్లగా కాకుండా ఎర్రగా మెరిసిపోతే ఎలా ఉంటుందో? అద్భుతంగా ఉంటుంది కదా! ఆ ఊహనే ఇప్పుడు జర్మనీ బైరోయిత్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిజం చేశారు. వెంటనే సాలెగూడు మీద ఎరుపు రంగు పూశారు అనుకుంటే పొరపాటే! ‘క్రిస్పర్‌’ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా వారు సాలెగూడు గుడ్లలో ఒక కొత్త ప్రొటీన్‌ను ప్రవేశపెట్టారు. 

ఫలితంగా పుట్టిన చిన్న సాలీళ్లు తమ తంతులను ఎర్రరంగులో అల్లడం మొదలుపెట్టాయి. ఇలా సహజంగా వచ్చే సాలె తంతులు ఇప్పుడు మనిషి ఆలోచనలతో కలిసిన ఒక అద్భుతంగా మారింది. ఇది కేవలం రంగుల వరకే పరిమితం కాదు, ఈ తంతులను మనిషి అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవచ్చు. 

బలంగా కావాలంటే బలంగా, మృదువుగా కావాలంటే మృదువుగా కొత్త అవసరాలకు అనుగుణంగా ఎలాగైనా మలచుకునే వీలు ఉంది. భవిష్యత్తులో డాక్టర్లకు శరీరంలో కరిగిపోయే కుట్లకూ, డిజైనర్లకు కొత్త బట్టల మేళవింపుకూ, ఇంకా ఎన్నో రంగాల్లో వినియోగించుకునేందుకు ఈ సాలెగూడు తంతులే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. ప్రస్తుతం ఇది పరిశోధన దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను తీసుకురాగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!)
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)