Breaking News

ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్‌ మంత్రి..! ఎందుకోసం అంటే..

Published on Wed, 09/17/2025 - 15:48

ఇంతవరకు ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ ఆర్థిక రంగం, ఎంటర్‌టైన్‌మెంట్‌, రవాణ, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అస్సలు ఇక మ్యాన్‌పవర్‌తో పనిలేదు, అస్సలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి..పాలకులకు పనిలేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికత మయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటేఓ దేశంలో ఏఐ.. ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేగాదు రాజకీయాల్లో మహామహులునే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది. ఔను ఇదంతా నిజం. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..

అల్బేనియా దేశం ఆ చొరవను తీసుకుని సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్‌లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే ఏఐ డియెల్లా అనే మహిళా కేబబినేట్‌ మంత్రినే నియమించి అందర్ని విస్తుపోయాలా చేసింది అల్బేనియా ప్రభుత్వం. అంతేగాదు ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినేట్‌ మంత్రిని నియమించుకున్న దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి, హాట్‌టాపిక్‌గా మారింది.

అల్బేనియాలో ఈ ఏఐ మంత్రి పాత్ర..
ఒకానొక సమ్మర్‌లో ప్రధాన మంత్రి ఏడీ రామ మాట్లాడుతూ..ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్‌ మంత్రి, ప్రధాన మంత్రి కూడా రావొచ్చేమో అని కామెడీగా అన్నారు. ఇలా అన్నారో లేదో ఊహకందని విధంగా ఆ రోజు రానే వచ్చేయడం విశేషం. ఇటీవలి జరిగిన సోషలిస్ట్‌ పార్టీ సమావేశంలో ఏయే మంత్రులు తదుపరి పదవికి కొనసాగుతారో, ఎవరో వెళ్లిపోతారో ప్రధాని రామ ప్రకటించారు. ఆ సమయంలోనే మానవేతర సభ్యురాలు డీయోల్లా అనే మహిళా  ఏఐని కూడా ఆయన నేతలకు పరిచయం చేశారు. 

ఆమె భౌతికంగా హాజరు కానప్పటికీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమెనే. కృత్రిమ మేధస్సుతో (ఏఐ) సృష్టించబడిన ఏఐ మంత్రి అని పార్టీ సభ్యులకు తెలిపారు. అంతేగాదు ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కాదని, డీయెల్లా విధి అని నాయకులకు చెప్పారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు కూడా. ఇక ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశల వారీగా జరుగుతుందని, పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు.

సింపుల్‌గా చెప్పాలంటే అ‍ల్బేనియా ప్రభత్వం చేసిన నిజమైన రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇక ఈ ఏఐ మంత్రి గారు వాయిస్‌  కమాండ్‌ల ద్వారా బ్యూరోక్రాటిక్‌ అభ్యర్థనలను ప్రాసెస్‌ చేస్తూనే ఉన్నా.. ఇప్పటికే దేశ డిజిటల్‌ సేవల పోర్టల్‌ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. 

కాగా, ప్రధాని రామా ప్రకారం..ఈ వ్యవస్థ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం. దీనిని నిజంగా పాలన పరిణామంలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ఈ డెవలప్‌మెంట్‌ అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనది నిలిచేలా చేసినప్పటికీ..ఈ ఘటన మాత్రం సర్వత్ర చ​ర్చనీయాంశంగా మారింది.

(చదవండి: పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!)

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)