Breaking News

వేగనిజం అంటే ఏంట్రా అబ్బాయ్‌?

Published on Sun, 11/01/2026 - 04:39

‘నా ఫ్రెండ్‌ వేగన్‌ నాన్నా’ అంటాడు కొడుకు. ‘అంటే ఏంటిరా?’ అంటాడు తండ్రి. ‘పాలు, పెరుగు కూడా ముట్టడు నాన్నా’ ‘అదేంటి.. వాడూ శాకాహారేగా?’ 
‘శాకాహారమే నాన్నా.. కానీ అందులో నెక్ట్స్‌ లెవల్‌!’ ఇలాంటి కాన్వర్సేషన్స్ ఈ మధ్య మన ఇళ్లలో చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. జెన్‌జి ‘వేగనిజం’ వైపు అడుగులు వేస్తోంది. ‘వరల్డ్‌ వేగన్‌ డే’ సందర్భంగా అసలు ఈ కథేంటో ఓసారి చూద్దాం.

‘ఒరేయ్‌... అసలు పాలు కూడా తాగని శాకాహారం ఎప్పుడు స్టార్ట్‌ అయిందిరా? నిన్న మొన్న మీ జనరేషన్‌ తెచ్చిందేనా?’ అని అడిగాడు తండ్రి టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ. కొడుకు నవ్వి ‘లేదు నాన్నా. దీని వెనుక పెద్ద హిస్టరీనే ఉంది. జంతువుల నుంచి వచ్చే ఏ వస్తువూ వాడకూడదనే థాట్‌ ఎప్పటి నుంచో ఉన్నా దీనికి ‘వేగన్‌’ అనే పేరు పెట్టింది మాత్రం 1944లో డోనాల్డ్‌ వాట్సన్‌ అనే బ్రిటిష్‌ టీచర్‌. ‘వెజిటేరియన్‌’ అనే వర్డ్‌ లోంచి మొదటి మూడు, చివరి రెండు అక్షరాలు కట్‌ చేసి ఈ పేరు పెట్టాడు. అతను మరో ఐదుగురితో కలిసి ఆ సంవత్సరం నవంబర్‌ 1న ‘వేగన్‌ సొసైటీ’ స్థాపించాడు. 1994లో దానికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా నవంబర్‌ 1ని ‘వరల్డ్‌ వేగన్‌ డే’గా డిక్లేర్‌ చేశారు’ అని హిస్టరీ క్లాస్‌ పీకాడు కొడుకు.

ఎందుకు ఈ పట్టుదల?
‘అంతా బాగానే ఉంది కానీ కమ్మటి పాలు, పెరుగు, నెయ్యి తింటే ఏమొచ్చిందిరా? వాటిని కూడా ఎందుకు వదిలేయడం?’ అని అడిగాడు తండ్రి కాస్త ఆశ్చర్యంగా. ‘అక్కడే ఉంది లాజిక్‌ నాన్నా. దీనికి మెయిన్‌ రీజన్‌ మూగజీవులపై కరుణ. డెయిరీ ఇండస్ట్రీస్‌లో పాలు పితకడం కోసం పశువులను ఎంత హింసిస్తారో మనకు తెలుసు. పైగా దూడలకు పాలు దక్కకుండా చేస్తారు. జంతువులను  ఆహారయంత్రాల్లా చూడొద్దనేది వేగన్స్ వాదన. అంతేకాదు, పర్యావరణ రక్షణ కూడా ఇందులో ఉంది. పాల కోసం, మాంసం కోసం అధిక సంఖ్య లో పశువుల పెంపకం వల్ల గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగిపోతోందని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే కోహ్లీ, సమంత లాంటి సెలబ్రిటీలు ఈ లైఫ్‌స్టైల్‌కి షిఫ్ట్‌ అయిపోయారు’ అని వివరించాడు కొడుకు.

మంచి చెడ్డలేంటి?
‘సరే.. సెలబ్రిటీలు ఓకే.. మనలాంటి వాళ్లకు దీనివల్ల లాభమా నష్టమా?’ తండ్రి అసలు పాయింట్‌కి వచ్చాడు. ప్లాంట్‌ బేస్డ్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి నాన్నా. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది, వెయిట్‌ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే ఛాన్స్ తక్కువ. కానీ.. నాణేనికి ఇంకోవైపు ఇందులో కొన్ని తిప్పలు కూడా ఉన్నాయి. 

పాలు, గుడ్లు పూర్తిగా మానేయడం వల్ల విటమిన్‌ బి12, ఐరన్, కాల్షియం లోపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బి12 కేవలం జంతువుల ద్వారా వచ్చే ఫుడ్‌లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేగన్స్ కచ్చితంగా సప్లిమెంట్లు టాబ్లెట్స్‌ రూపంలో వాడాలి. లేదంటే నీరసం, అలసట వచ్చేస్తాయి’ అని ప్రాక్టికల్‌ ప్రాబ్లమ్స్‌ చెప్పాడు.

‘అమ్మో! పాలు, పెరుగు లేని సండేని మనం ఊహించుకోలేం గానీ పర్యావరణం కోసం ఆ కఠినమైన డైట్‌ ఫాలో అవుతున్న వాళ్ల ఓపికను మెచ్చుకోవాల్సిందేరా’ అన్నాడు తండ్రి పేపర్‌ మడత పెడుతూ. 
నిజమే, వేగన్‌గా మారాలా వద్దా అనేది ఎవరి పర్సనల్‌ ఇష్టం వాళ్లది. కానీ మూగజీవులను ప్రేమించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం మాత్రం మనందరి బాధ్యత.      
చిన్న డౌటు
‘ఇందులో నిజాయితీ ఎంతరా? ఏదో ఫ్యాషన్ గా, స్టైల్‌గా చెప్పుకోవడానికి ఇలా చేస్తుండొచ్చు’ అన్నాడు తండ్రి అనుమానంగా.
‘నువ్వు చెప్పింది కొంతవరకు కరెక్టే నాన్నా. 
ఈ మధ్య సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం, తాము చాలా ‘అప్‌డేటెడ్‌’ అని చూపించుకోవడానికి వేగనిజం బోర్డు తగిలించుకునే వాళ్లు ఉన్నారు. దాన్ని ‘ఫ్యాడ్‌ వేగనిజం’ అంటారు. కానీ అందరూ అలా లేరు నాన్నా. నిజాయితీగా తమ లైఫ్‌స్టైల్‌ మార్చుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ప్లాంట్‌ బేస్డ్‌ మీట్, వేగన్‌ కాస్మెటిక్స్‌ మార్కెట్లోకి తెస్తున్నాయంటే దీని వెనక ఫ్యాషన్‌ మాత్రమే లేదు స్ట్రాంగ్‌ బిజినెస్‌... నమ్మకం కూడా ఉన్నాయి’ అని క్లారిటీ ఇచ్చాడు కొడుకు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)