Breaking News

సముద్రమంత ప్రేమ : ఎవరీ సతీష్‌ భాస్కర్‌

Published on Sat, 05/23/2026 - 16:40

World Turtle Day ‘సతీష్‌ భాస్కర్‌’ అనే పేరు వినబడగానే చాలామందికి తాబేళ్లు గుర్తుకు వస్తాయి.ఆయనకు ‘తాబేళ్ల సంరక్షకుడు’ అని పేరు. చిన్నప్పటి నుంచి సతీష్‌ భాస్కర్‌కు సముద్రపు తాబేళ్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను తాబేళ్ల ప్రపంచంలోకి  తీసుకు వెళ్లింది. ఆ ప్రపంచంలో ఆయన వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు.అయితే ఆయన ఉక్కు సంకల్పం ముందు  ఆ ఆటంకాలు నిలవలేకపోయాయి... 

తాబేళ్ల  పరిరక్షణ కోసం ఎవరి తోడూ లేకున్నా వేల కిలోమీటర్‌ల దూరం ఒంటరి ప్రయాణం చేశారు సతీష్‌ భాస్కర్‌. తీర్ర΄ాంత మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న ట్రాన్సిస్టర్‌ రేడియో, అలుపెరుగని స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉండేవి. అండమాన్‌ దీవుల తీరాలలో సముద్ర తాబేళ్ల పరిరక్షణకు భాస్కర్‌  చేపట్టిన కార్యక్రమాలు విస్తృతమైన ఆయన పరిశోధనకు గీటురాయిగా మారాయి.

ఆకలితో కొన్ని రోజులు...
లక్షద్వీప్‌లోని జనావాసాలు లేని సుహేలి ద్వీ΄ానికి వెళ్లారు భాస్కర్‌. అక్కడ అయిదు నెలల పాటు తాబేళ్లపై సర్వేలు నిర్వహించారు. ఆ ద్వీపానికి వెళ్లడం చాలా కష్టం. అయినా అష్టకష్టాలు పడి అక్కడికి చేరుకున్నారు. అండమాన్‌ ద్వీపంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తినడానికి అతడి దగర్గ ఏమీ లేదు. ఆకలిని తట్టుకోలేని పరిస్థితులలో అక్కడి ఆదిమ గిరిజన తెగ వారి దగ్గర కాల్చిన మాంసం తెచ్చుకొని కడుపు నింపుకున్నారు.

టర్టిల్‌ వాకర్‌
సుహేలి ద్వీపంలో ఉన్నప్పుడు కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఇండోనేషియాలోని వెస్ట్‌ పపువా వంటి తీర్ర ప్రాంతాల వెంబడి అలుపెరుగకుండా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతిచోట తన ప్రయాణానికి పరమార్థాన్ని వెదుక్కున్నారు భాస్కర్‌. తాబేళ్ల ప్రపంచం గురించి సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడానికి తాను చేసిన ప్రయాణాలు ఉపకరించాయి. ‘టర్టిల్‌ వాకర్‌’ పేరుతో భాస్కర్‌పై 75 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు తైరా మాలనీ. ఈ డాక్యుమెంటరీ జాక్సన్‌ వైల్డ్‌ మీడియా అవార్డ్స్‌లో కన్జర్వేషన్, గ్రాండ్‌ టెటాన్‌ అవార్డులను అందుకుంది. సతీష్‌ భాస్కర్‌ ప్రయాణం గురించి ఈ డాక్యుమెంటరీ చెప్పే మాట...‘అతడిది...మృత్యువును ధిక్కరించే అన్వేషణ’

సముద్ర తాబేళ్ల ఆవాసాలను గుర్తించే ప్రయత్నంలో మన దేశంలో తీర్ర΄ాంతంలో నాలుగువేల కిలోమీటర్లు ప్రయాణించారు భాస్కర్‌. గూళ్లు కట్టే విధానం నుంచి గుడ్ల స్వభావం వరకు తాబేళ్లకు సంబంధించి అనేక కోణాలలో అధ్యయనం చేశారు.  ఆయన సాహసాలు, ప్రయత్నాలు రాబోయే తరాలు తాబేళ్లను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలిచాయి.

తాబేళ్ల సంరక్షణ కోసం...
గుడ్లు, మాంసం, పెంకులు, చర్మం కోసం తాబేళ్లను వధిస్తున్నారు వేటగాళ్లు. మరోవైపు... చేపల వలలతో  ప్రమాదవశాత్తు తాబేళ్ల ఆవాసాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయాలు సతీష్‌ భాస్కర్‌ను తీవ్రంగా కలచివేశాయి. బాధపడడానికి మాత్రమే పరిమితం కాకుండా తన జీవితాన్ని తాబేళ్ల సంరక్షణకు అంకితం చేశారు. తాబేళ్ల స్థితి గతులు, పరిరక్షణపై యాభైకి పైగా రిపోర్ట్‌లు వెలువరించారు. 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)