Breaking News

ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత

Published on Mon, 04/29/2024 - 16:37

ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌కు చెందిన మరియా ఫెలిసియానా దోస్‌ శాంటోస్‌ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు,  ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు.  ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.

గాయని, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది.   ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్‌ అయింది. 

1960లో క్వీన్‌ ఆఫ్‌హైట్‌ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్‌ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్‌లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్‌.  వీరికి ముగ్గురు పిల్లలు.   మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)