Breaking News

సంగీతానికి ఆ శక్తి ఉందా?

Published on Fri, 06/21/2024 - 14:11

సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నయం చేయడమే గాక ఉల్లాసంగా ఉండేలా చేస్తుందని చెబుతుంటారు. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం(జూన్‌ 21న) పురస్కరించుకుని దీని ప్రాముఖ్యత గురించి, ఆరోగ్య ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

శ్రావ్యమైన సంగీతం విభిన్న సంస్కృతులను, సరిహద్దులను దాటి భాషలకు అతీతంగా అందర్నీ ఒక్కటి చేస్తుంది. దాని మాధుర్యానికి ఎవ్వరైన పరవశించిపోవాల్సిందే. మంచి రమ్యమైన సంగీతం మనసు స్వాంతన చేకూర్చి.. శాంతిని అందించగలదు కూడా. అలాంటి ఈ సంగీతం మన అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజు మంచి సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, హీలింగ్‌ రేటు పెరుగుతుందట. ఇదెలా నయం చేస్తుందంటే..

సంగీతం ప్లే చేసినప్పుడూ ఆ తరంగాలు మన చెవిని తాకగానే మన శరీరం ఒక విధమైన విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో రక్తం సులభంగా శరీరం మంతట ప్రసరిసించి..హృదయస్పందన రేటు, రక్తపోటు స్థాయిలు తగ్గడమే గాక కార్డిసాల్‌ స్టాయిలు కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే రక్తంలోని సెరోటోనిన్‌ ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుంది.  

మానసిక స్థితిని పెంచుతుంది. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. సంగీతం మెదుడలో డోపమైన హార్మోన్‌ ఉత్పత్తిని పెంచి ఆందోళన, డిప్రెషన్‌ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రపోయేముందు సంగీతం మంచి ఓదార్పునిచ్చి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 

శారీరీక అసౌకర్యం, నొప్పి వంటి వాటిని దూరం చేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. 

పలు అధ్యయనాల్లో మన మనసు, శరీరాలపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇది హృదయ స్పందన రేటు, బీపీని, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

అంతేగాదు సంగీతాన్ని వినడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అంతేగాదు పరధ్యానాన్ని అడ్డుకుని అటెన్షన్‌తో ఉండేలా చేస్తుంది.

(చదవండి: పాశ్చాత్యులకు యోగాను పరిచయం చేసింది ఈయనే..! ఏకంగా 60 దేశాలకు..)

 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)