Breaking News

రైడింగ్‌ స్కిల్‌తో అదరగొట్టిన ఉమెన్‌ రైడర్స్‌..!

Published on Mon, 06/23/2025 - 09:54

‘బైక్‌ స్టార్ట్‌ అవ్వగానే భయం కాదు, స్వేచ్ఛ, సాధికారత మొదలవ్వాలనే’ ఆత్మవిశ్వాసాన్ని మహిళల్లో నింపేందుకు నగరం వేదికగా ‘ఆర్‌ బీ ఫర్‌ ఉమెన్‌’ అనే మోటార్‌ సైకిల్‌ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వరల్డ్‌ మోటర్‌సైకిల్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని హాస్టెన్‌ గో కారి్టంగ్‌ జోన్‌లో బైక్‌ రెంటల్‌ సంస్థ రాయల్‌ బ్రదర్స్‌ ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు బైక్‌ రైడింగ్‌తో సందడి చేశారు. హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన ఈ 11వ ఎడిషన్‌లో 120 మందికి పైగా మహిళలు ప్రొఫెషనల్‌ శిక్షకుల ఆధ్వర్యంలో స్కూటర్లు, బైకులు నడిపారు. ఈ కార్యక్రమానికి యమహా మోటార్‌ కంపెనీ (జపాన్‌) అనుబంధ సంస్థ మోటో బిజినెస్‌ సర్వీస్‌ ఇండియా (ఎంబీఎస్‌ఐ) భాగస్వామిగా వ్యవహరించింది.  

సురక్షితమైన, నియంత్రిత ప్రాంగణంలో మహిళలకు బైక్‌ రైడింగ్‌పై శిక్షణ అందించారు. ఆర్‌ బీ ఫర్‌ ఉమెన్‌ పేరుతో నిర్వహించిన ఈ శిక్షణా శిబిరం మహిళలకు అవసరమైన అన్ని రకాల రైడింగ్‌ గేర్, బైకుల ఎంపికతో, వయసు, అనుభవంతో సంబంధం లేకుండా ప్రాథమిక స్థాయి నుంచి అభ్యాసం ఉన్నవారిని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేసి విజయవంతంగా పూర్తిచేశారు. పలువురు మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. బైక్‌ రైడింగ్‌కు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. 

మహిళలు సైతం..! 
‘ఆర్‌ బీ ఫర్‌ ఉమెన్‌’ ఇప్పటికే దేశవ్యాప్తంగా 570 మందికి పైగా మహిళలకు రైడింగ్‌లో శిక్షణ ఇచ్చింది. గృహిణుల నుంచి ప్రొఫెషనల్స్‌ వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు ఈ శిక్షణలో పాల్గొనడం విశేషం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత శిక్షణతో పాటు, బైక్‌ నడపడం మీద నమ్మకం కలి్పంచడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. బైక్‌ నడిపే ఈ చేతుల ద్వారా ఇప్పుడు మహిళలు తాము ఎంచుకునే దారిలో స్వతంత్రంగా ప్రయాణించగలుగుతున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఈ వినూత్న కార్యక్రమం మహిళల భవిష్యత్తు ప్రయాణానికి శుభారంభమని నిర్వాహకుల మాట. 

నూతన యాత్రకు ఆనం.. 
ఈ శిక్షణ కేవలం రోడ్డుపై నడవడానికి కాదు. ఇది మహిళల స్వతంత్రతకు చిహ్నం. సొంతగా బయటకు, ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఈ శిక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, సంప్రదాయ భావాలను వెనక్కి నెట్టే సాహసం కూడా మహిళల్లో పెరిగుతోంది. బైక్‌ నడిపే కళ మహిళల్లో సరికొత్త నైపుణ్యాన్ని మాత్రమే కాదు, సమానత్వం పట్ల స్ఫూర్తిని కూడా రేకెత్తిస్తోంది. ఈ కార్యక్రమం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నగరంలో స్వేచ్ఛగా తిరగడానికి ఒక మార్గం చూపుతుంది.

భవిష్యత్తు దిశ.. 
ఇకపై మరిన్ని నగరాల్లో ఈ శిక్షణ విస్తరించనుంది. ఒక సాధారణ శిక్షణ మాత్రమే కాదు, మహిళల జీవన శైలిని మార్చే ఒక శక్తివంతమైన ప్రయత్నంగా ‘ఆర్‌ బీ ఫర్‌ ఉమెన్‌’ నిలుస్తోంది. తలా తోకా లేకుండా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే నగర జీవితం మధ్య, ఒక చిన్న బైక్‌ స్వేచ్ఛను ఇచ్చే మార్గం కావడం ఎంతో గొప్ప విషయం కాదా..!?

ఆత్మవిశ్వాసానికి మొదటి అడుగు.. 
‘మేము 500 మిలియన్ల భారతీయులకు బైక్‌ మౌలిక అంశాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇందులో భాగంగా మహిళలకు స్కిల్‌ ఇవ్వడం అత్యంత కీలకమైన దశ. ఈ శిక్షణ కొత్త నైపుణ్యం మాత్రమే కాదు.. వారి స్వేచ్ఛకు, ఆత్మవిశ్వాసానికి మొదటి అడుగు!’ 
– అభిషేక్‌ చంద్రశేఖర్, రాయల్‌ బ్రదర్స్‌ సీఈఓ.  

ఎంబీఎస్‌ఐ దృష్టికోణం.. 
‘మొబిలిటీ లోపం వల్ల మహిళలు ఎన్నో పనులకు ఇతరులపై ఆధారపడుతున్నారు. బైక్‌ నడపడం 
నేర్చుకోడం ద్వారా వారి జీవన ప్రమాణం మెరుగవుతుంది. ‘ఆర్‌ బీ ఫర్‌ ఉమెన్‌’ ద్వారా మేము వారి జీవితాల్లో విలువను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం’. 
– నకావో హిరోషి ఎంబీఎస్‌ఐ సీఈఓ.   

(చదవండి: ఆసనం.. ఓ ఔషధం..! అధ్యయనం చెబుతోందిదే..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)