Breaking News

చూసుకో పదిలంగా.. ‘హృదయాన్ని అద్దంలా..!

Published on Mon, 09/29/2025 - 10:17

యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.

మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్‌సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్‌సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్‌ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

జీవనశైలి మార్పులతోనే
35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి.  హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి  కార్పొరేట్‌ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్‌ స్టోక్‌లు వస్తున్నాయి. (యంగ్‌ ఇండియా! ఒక్క బీట్‌ మిస్‌ అయినా.. బీ(ట్‌) కేర్‌ఫుల్‌)

గుండె నొప్పి లక్షణాలు

శ్వాస తీసుకోవడంలో    ఇబ్బందులు
ఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసం
జీర్ణాశయం పైభాగాన నొప్పి
ఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
 బీపీ, షుగర్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి.
45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.

చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి

గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
ప్రజలు గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి. దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. 
– డాక్టర్‌ ఎన్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కార్డియాలజీ వ్యాధి నిపుణులు, కడప

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)