Breaking News

World Bicycle Day 2025 డయాబెటిస్‌కు, ఊబకాయానికి చెక్‌

Published on Tue, 06/03/2025 - 10:04

World Bicycle Day 2025 నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో అందరికీ అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన వాహనం సైకిల్‌. ఒకప్పుడు సైకిల్‌ ఉందంటే ధనిక కుటుంబంగా భావించే పరిస్థితి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా సైకిల్‌నే వాడేవారు. కొత్తగా పెళ్లయిన జంటలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, స్నేహితులు ఇలా ఎంతోమంది సరదాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే సైకిలే ఆధునిక ప్రయాణ సాధనం. అటువంటి సైకిల్‌ కొంతకాలంగా తన ప్రభావాన్నీ, ప్రాధాన్యాన్నీ కోల్పోతోంది.  మోటార్‌ సైకిళ్ళు, కార్లు వంటి వాహనాలు సైకిళ్ల స్థానాన్ని ఆక్రమించాయి. అయితే నార్డిక్‌ దేశాల్లో నేటికీ రవాణా సాధనంగా సైకిల్‌కి అత్యంత ప్రాధాన్యం ఉండటం గమనార్హం. 

ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్‌.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్‌

మోటారు వాహనాల వాడకం కాలుష్య కారకం కాబట్టి సైకిల్‌ను వాడాలని స్వీడన్‌ ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం జూన్‌ 3వ తేదీన ‘అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవం’ జరిపే విధంగా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా 2018 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ ఏడాది ‘సైకిల్‌ ద్వారా ఆరోగ్యం, సమానత్వం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం’ అనే థీమ్‌ను ఎన్నుకున్నారు. 

చదవండి: World Bicycle Day: మొదటి వాహనముకు వందనం!

నేడు సైకిల్‌ వాడకంలో ప్రపంచంలోనే ముందున్న దేశం ‘నెదర్లాండ్స్‌’. సైకిల్‌ తొక్కడం ఓ మంచి వ్యాయామం. కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా మోటార్‌ సైకిళ్ళు, కార్లు వినియోగించడం సరికాదు. నడవడమో లేక సైకిల్‌పై వెళ్లిరావడమో అలవాటు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ‘సైకిల్‌ ట్రాక్‌’లు ఏర్పాటు చేయాలి. ‘సైక్లింగ్‌‘ ఒక ఫ్యాషన్‌గా మారాలి. ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలు పరిష్కారానికీ; ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ, మంచి నిద్రకీ, అధిక రక్తపోటు నియంత్రణకూ సైకిల్‌ తొక్కడం మంచి తరుణోపాయం. 
– ఐ.ప్రసాదరావు, ఉపాధ్యాయుడు, కాకినాడ.
(నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం)

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)