ప్రాణాలు నిలిపే అదృష్టం ఊరికే రాదు!

Published on Wed, 10/15/2025 - 11:34

World Anaesthesia Day 2025  అదృష్టం ఊరికే రాదు. ఎవరైనా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అంది వస్తుంది. ఒక ప్రాణం కాపాడటం అలాంటి అదృష్టమే. దానికి వైద్యుడే కానక్కర లేదు. కొద్దిపాటి అవగాహన, కొంచెం శిక్షణ దొరికితే ప్రతీ పౌరుడూ ప్రాణం నిలపగలడు. మొదట నా సొంత అనుభవానికి వద్దాం. వైద్యునిగా, ప్రత్యేకించి అనస్థీషియా (మత్తువైద్యం) నిపుణుడిగా ఎవరికైనా అరు దుగా దక్కే అదృష్టం నాకు దక్కింది. అదేమిటంటే నా చేతిలో నా తండ్రి ప్రాణం తిరిగి రావడం! నేను 2001లో ఎంపీగా ఉన్న రోజుల్లో ఒక అధికారిక పర్యటనలో ఉండగా మా పల్లెటూరు పాలికవలసనుండి ఫోన్‌ వచ్చింది... నాన్నకు బాగులేదని. పార్వతీపురం నుండి ఆ ఊరు నలభై కిలోమీటర్లు. అప్పటికే నాన్న బీపీ పేషెంట్‌ కనుక ఎందుకైనా మంచిదని అత్యవసర మందులు పట్టుకుని బయలుదేరాను. ఇంటికి చేరి మూడు నిమిషాలు అయిందో లేదో నాన్నకు గుండె, ఊపిరి ఆగి పోయాయి (కార్డియాక్‌ అరెస్ట్‌). వెంటనే ఆయన్ని సరైన పొజిషన్‌లో ఉంచి నోటితో శ్వాస అందిస్తూ, గుండెపై బలంగా నొక్కుతూ అత్యవసర ప్రక్రియ చేపట్టాను. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం మళ్లీ మొదలైంది. గండం గట్టెక్కింది. మిగతా వైద్యం కోసం హాస్పిటల్‌కు తక్షణం పంపే ఏర్పాట్లు చేశాను. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామీణులకే కాదు, బాగా చదువుకున్న అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా వింత. నాకు పట్టరాని ఆనందం. తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందం.

చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్‌ జీతాన్ని వదులుకుని రిస్క్‌ చేస్తే..!

గుండె, ఊపిరి ఆగిపోయిన క్షణాల్లో అందించే ప్రాథమిక అత్యవసర ప్రక్రియ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌) క్లిష్టమైన ప్రక్రియ కాదు. ఎవరైనా నేర్చుకోగలరు. గతంలో అది వైద్యులకే పరిమితమైన విద్య. ఇప్పుడుఅందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఎందుకంటే ఆ మొదటి క్షణాల్లో అందించే వైద్య సహాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. రోగిని గట్టి బల్లపై లేదా రోడ్డుపై పడుకోబెట్టడం, ఛాతీపై తగు బలంతో నిమి షానికి 100 సార్లు చేతులతో ఒత్తిడి ఇవ్వడం, అభ్యంతరం లేకపోతే నోటికి నోటి ద్వారా శ్వాస అందించడం లాంటి వాటితో ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రావచ్చు. ఈ నైపుణ్యాలపై విద్యార్థుల్లో, పౌరులందరిలో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఈ దిశగా జరుగుతున్న కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రభుత్వం, పౌర సమాజం దృష్టి పెడితే ప్రజారోగ్య కోణంలో సమాజానికి చాలా మేలు జరుగుతుంది.
– డా.డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ
(అక్టోబర్‌ 15.. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం) 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)