Breaking News

చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రాజీ పడకూడదనుకుంది..కట్‌చేస్తే..!

Published on Thu, 01/30/2025 - 11:19

చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు మనకు పరోక్షంగా మంచి జీవనశైలి అవలంభించమని సంకేతమిస్తుంటాయి. మన శరీరం చెప్పే మాట వింటే ఆరోగ్యం, బరువు మన చేతిలో ఉంటుంది. లేదంటే అధిక బరువుతో లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వక తప్పదు. కనీసం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడే మేల్కొని మంచి ఆహారపు అలవాట్లతో బరువు తగ్గేందుకు ఉపక్రమించి ఎందరికో స్ఫూరిగా నిలుస్తున్నారు కొందరు. అచ్చం అలానే బరువు తగ్గి ఆరోగ్యంలో రాజీ ఉండకూడదని చాటి చెప్పి శెభాష్‌ అనిపించుకుంది ఈ మహిళ. 

ఆ మహిళ పేరు రాజీ ఘంఘాస్‌. ఆమె జనవరి 2024లో సుమారు 155 కిలోల బరువుతో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుండేది. భారీకాయం వల్ల కొద్ది దూరం నడకకే ఆయాస పడిపోతుండేది. అలాగే ఈ అధిక బరువు కారణంగా ఆమె రూపం అసహ్యంగా మారడమే గాక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. అధిక బరువు, హర్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, ప్రీ డయాబెటిక్‌ వంటి సమస్యలను ఎదుర్కొంది. 

ఆమెను చూస్తే పెద్దన్నాళ్లు ఈ బరువుతో బతకదేమో అనేంతలా ఇబ్బందులుపడింది. అప్పుడే రాజీ అనుకుంది భగవంతుడి ఇచ్చిన రూపం మార్చలేను, కానీ అనారోగ్యాన్ని భరిస్తూ మాత్రం చావలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. ముందు అందం కంటే ఆరోగ్యంగా ఉండటమే ప్రధానం, పైగా అది తన చేతిలో ఉన్న అవకాశం అని గ్రహించింది రాజీ. 

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి ఆహారపు అలవాట్లను అనుసరించింది. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చింది. "రోజుని మెంతులు, యాలకులతో ఉడికించిన గోరువెచ్చని డిటాక్స్‌ వాటర్‌తో ప్రారంభించేది. అ‍ల్పహారంగా కూరగాయలతో నిండిన పోహా వంటివి తీసుకునేది. మధ్యాహ్నం చియా గింజల నీరు, ఓట్స్‌ తీసుకునేది. సాయంత్రం: గ్రీన్‌ టీ, మొక్కజొన్న చాట్‌. ఇక రాత్రికి కూరగాయలతో చేసిన శాండ్‌విచ్‌లు, డిటాక్స్‌ నీరు తీసుకునేది. 

క్రమం తప్పకుండా ఈ డైట్‌ని అనుసరించింది. తన అధిక బరువుతో ఎదురవ్వుతున్న ఆరోగ్య సమస్యలు గుర్తొచ్చి చీట్‌మీల్‌కి చోటివ్వకుండా నిబద్ధతతో ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించింది రాజీ". అలా ఒక్క ఏడాదికే 60 కిలోలు తగ్గి 95కిలోల బరువుకి చేరింది. 

అయితే వెయిట్‌ లాస్‌ జ​ర్నీ మగియలేదని అంతలా 155 కిలోల బరువు ఉన్న తాను ఇంతలా బరువు తగ్గుతానని కలలో కూడా ఊహించలేదని ఆనందంగా చెబుతోంది రాజీ. ఆరోగ్యకరమైన బరువు చేరుకునేవరకు తన వెయిట్‌ లాస్‌ జర్నీ ఆగదని సోషల్‌ మీడియా వేదికగా తన అనుభవాల్ని షేర్‌ చేసుకుంది. 

 

(చదవండి: సింగిల్‌ పేరెంటింగ్‌ సవాలుని సులభంగా అధిగమించండిలా..!)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)