Breaking News

నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్‌ చేస్తే

Published on Wed, 10/08/2025 - 16:06

ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన  వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి  ఇది షాకింగ్‌ న్యూస్‌. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక  చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత  ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.  విషయం ఏమిటంటే..
 
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్  ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు  జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్‌తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక  బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని  నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.

నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి  పాలైంది.  విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్‌తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సం‍ప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్‌వార్మ్ లార్వా స్పార్గానమ్‌తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో  రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని,  పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు  తెలిపారు.

నోట్‌ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు.

 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)