Breaking News

వృద్ధులకు వెయిట్‌​ లిఫ్టింగ్‌ ట్రైనింగ్‌ ఎందుకు మంచిదంటే..!

Published on Wed, 06/03/2026 - 13:59

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండేందుకు బల శిక్షణ(స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌) ఎంతో మంచిదంటోంది హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ జీనా అరాగాన్. కండరాల క్షీణత, ఎముకలు, కీళ్లు బలహీనపడటం వంటి ఇతర కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ ప్రజలు బలహీనపడతారు. దీనికి విరుగుడు బరువులు మోయడ మేలని  చెబుతోంది. 

అదెలాగో తన 87 ఏళ్ల తండ్రిని ఉదాహరణగా చూపిస్తూ..ఆయన జిమ్‌ వర్కౌట్లతో ఎలా మెరుగ్గా ఉన్నారో వివరించేలా వీడియోని షేర్‌ చేశారామె. ఆయన ప్రతి వారం ఈ వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసేలా చూస్తుంటానని చెప్పారామె. అయితే తన తండ్రి కేవలం పైకి, కిందకు వెయిట్‌లిప్ట్‌ చేస్తూ..కండరాలకు మాత్రమే పనికల్పిస్తున్నాని అనుకుంటారు. కానీ అంతకు మించి ప్రభావవంతమైందని, మొత్తం బాడీలోని అన్నింటికి మంచిదని ఆయనకు తెలియదని చెప్పుకొచ్చింది. 

ఆయన వయసు పైబడుతున్ను కొద్దీ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే వ్యాయం ఇదేనని, అందుకే ఆయన చురుకుగా, బలంగా ఉండేలా ఇలా కండరాలకు ఇలా బరువులు ఎత్తే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనను పదేపదే జిమ్‌కి వచ్చేలా చూడటమే తన పని అంటోంది. అయితే ఆయన ఈ జిమ్‌ సెషన్లో పాల్గొనెటప్పడూ..మంచి అనుభూతితో, తన కేర్‌ని అర్థం చేసుకునేలా చేస్తానంటోంది. ముఖ్యంగా ఆయన తన తదుపరి సెషన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. 

ఆయన వెయిట్‌లిఫ్ట్‌కి సంబంధించిన రెండు రకాల ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారని అన్నారామె. ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా తన తండ్రి బ్యాలెన్స్‌ చేసుకోగలరని, అలాగే 80 పౌండ్ల కంటే ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేగాదు వృద్ధులకు బరువులు ఎత్తడం వంటి వర్కౌట్లు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. 

 

(చదవండి: సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్‌ లవ్‌ ప్రపోజ్‌!)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)