Breaking News

'తల్లులు' డోంట్‌ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్‌ 34 రోజుల్లోనే..!

Published on Mon, 11/04/2024 - 15:35

మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను  అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్‌లాస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్‌ లాస్‌ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్‌ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్‌లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్‌ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్‌'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..

మొదటిది..
శరీరం హైడ్రేటెడ్‌ ఉంచుకునేలా చూడటం..
రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్‌ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్‌ టైమర్‌ సహాయంతో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేది. 

నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్‌ ఆన్‌ అయ్యేలా సెట్‌ చేసింది వెంటనే 20 సిప్‌ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది. 

రెండొవది ..
ఆహారంలో మార్పులు..
జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్‌లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్‌ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా. 

మూడొవది..
క్రమం తప్పకుండా తన బరువుని చెక్‌చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్‌ మైండ్‌తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా. 

ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్‌ ఆటిట్యూడ్‌కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.

(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?)

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)