Breaking News

షాకింగ్: మూడేళ్లుగా కడుపులోనే ‘రాతి శిశువు

Published on Fri, 10/30/2026 - 14:17

కొందరి మహిళలకి గర్భందాల్చాక..ఆ తర్వాత తీసుకోవాల్సిన వైద్య సహాయంపై అంతగా అవగాహన ఉండదు. పైగా వాళ్లకు తమకు గర్భం వచ్చినట్లు, ముగిసిపోయినట్లు కూడాతెలియదు. దాంతో కడుపులో చనిపోయిన శిశువుని ఏళ్లుగా మోస్తూనే ఉంటారు. కొందరు అయితే వృద్ధాప్య దశ వరకు అలానే గర్భంలో మోస్తూ ఉంటారు. కానీ ఈ మహిళకు మూడేళ్లలోపే ఈ పరిస్థితతి బయటపడింది. విపరీతమైన కడుపు నొప్పి కారణంగా..ఆ విషయం బయటపడటం, ఆ సమస్య నుంచి ఉపశమనం పొందడం చకచక​ జరిగాయి.   

సోమాలిలాండ్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ సుమారు మూడేళ్లుగా తన కడుపులో గట్టిపడిన రాతి శిశువుని మోసింది. కాల్షియం మాదిరిగా గట్టిపడిపోతుంది పిండం. అయితే ఆమెకు గత కొన్నేళ్లుగా నిరంతరం కడుపు నొప్పి, బరువుగా ఉండటం వంటి ఇబ్బందులను ఎదర్కొంది. ఆ తర్వాత నెలలో ఆ లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే వైద్యులు ఆమెను క్షుణ్ణంగా విచారించగా..తను గతంలో గర్భధారణ సంకేతాలు అనుభవించినట్లు గుర్తు చేసుకుంది. 

కడుపు ఉబ్బడం, పిండం కదిలిన అనుభవాలను వెల్లడించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా గర్భం మాయమైందని పేర్కొంది. దాంతో వైద్యులు ఆమె త్రీ-డైమెన్షనల్ రీకన్‌స్ట్రక్షన్‌తో సీటీ స్కాన్‌ నిర్వహించి..గర్భాశయం వెలుపల కాల్షియంలా పేరుకుపోయిన గడ్డను గుర్తించారు. ఈ గడ్డ లోపల పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు, అవయవాల ఎముకలతో కూడిన పిండం అస్థిపంజరం ఉన్నట్లు నిర్థారించారు. దీన్ని వైద్యులు లిథోపెడియన్‌గా పేర్కొన్నారు. 

ఈ పరిస్థితలో పొత్తికడుపులో గర్భధారణ సమయంలో పిండం చనిపోయి..తల్లి శరీరంలో కలిసిపోకుండా కాల్షియంలా పేరుకుపోతుంది. ఫలితం వాటిని చుట్టుపక్కల కణజాలాల వేరుచేసేందుకు ఉపయోగపడుతుందట. దీన్ని వైద్య పరిభాషలో రాతిశిశువుగా పేర్కొంటారని చెప్పారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసి ఆ రాతి శిశువుని తొలగించారు వైద్యులు. ఆ తర్వాత కడుపు నొప్పి తగ్గిపోవడమే కాకుండా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యింది. 

అంతేగాదు గణాంకాల ప్రకారం..ఇలాంటి కేసులు ఇప్పటి వరకు 340 నమోదు చేశారుట. ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి సమస్యలు ఎదురవుతాయని అన్నారు. అయితే ఇలాంటి అవశేషాలు వృద్ధమహిళల్లో గుర్తించామని, కానీ ఈ బాధతురాలి విషయంలో అలా కాకపోవడం కొంత మెరుగేనని అన్నారు వైద్యులు.

ఇదీ చదవండి: 74 ఏళ్లలో సైకిల్‌..82 ఏళ్లకు బైక్‌, ట్రాక్టర్‌! వయసునే సవాలు చేస్తున్న బామ్మ..!
 

#

Tags : 1

Videos

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

మా మహిళలపైనే చేయి వేస్తారా..? అందరి డేటా ఉంది..!

టీడీపీకి షాక్.. YSRCP లోకి భారీగా చేరికలు

9 నెలల వర్కవుట్స్.. సమంత స్పెషల్ వీడియో!

పులివెందులలో TDP మాస్టర్ స్కెచ్ .. పోలీసులే దగ్గరుండి లాడ్జీలలో..!

Photos

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)