Breaking News

ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది! సరిగ్గా 11 రోజుల తర్వాత..

Published on Thu, 08/17/2023 - 15:40

ఒ‍క్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్‌ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా అనే మహిళ పొరపాటున సజీవ సమాధి అయ్యిందనే విషయం గుప్పుమంది. ఆమె డెత్‌ సర్టిఫికేట్‌లో షాక్‌కి గురయ్యి, గుండెపోటుతో మరణించినట్లు ఉంది. దీంతో తాము ఖననం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె సమాధి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లు ఆ సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఓ మనిషి మూలుగు వినిపోస్తుందని అందరూ చెప్పడంతో.. బంధువులు ఆమె చనిపోయిన 11వ రోజున ఆమె సమాధికి వద్దకు చేరుకుని తవ్వడం ప్రారంభించారు.

వెలికితీయగా బంధువులంతా అల్మెడాని  చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్‌ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్‌ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లతో టెన్షన్‌ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది.

అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్‌ ఘటన అనేక ట్విస్ట్‌లతో బాధకరంగా ముగిసింది. 

(చదవండి: మనిషి బ్రెయిన్‌ వేవ్స్‌తో..ఏకంగా "పాట"నే పునర్నిర్మించారు!)

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)