Breaking News

యాలకుల వాటర్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!

Published on Sat, 06/08/2024 - 16:18

జీరా వాటర్‌, మెంతి వాటర్‌ తాగడం గురించి విని ఉంటారు. యాలకుల వాటర్‌ గురించి విని ఉండరు. ఈ యాలకులను స్వీట్స్‌ తయారీలో మంచి ఘుమ ఘుమలాడే సువాసన కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే స్పైసీ కర్రీల్లో కూడా వాడుతుంటారు. అలాంటి యాలకుల వేసి మరిగించిన నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకుల సుగంధభరతమైన వాసనకి కచ్చితంగా.. ఈ నీళ్లను సులభంగా తాగగలం కూడా. అందులో ఆరోగ్యం కోసం అంటే ఎవరైనా ఎందుకు మిస్‌ చేసుకుంటారు..?. మరీ ఈ యాలకుల వాటర్‌తో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దామా..!

  • యాలకులు ఫినోలిక్‌ సమ్మేళనాలు, అస్థిర నూనెలు, ఫిక్స్‌డ్‌ ఆయిల్స్‌తో నిండి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచాయి. ముఖ్యంగా ప్రేగుల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో ఉన్న అదనపు గ్యాస్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

  • యాలుకుల్లో యాంటీమైక్రోబయాల్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాలుకుల్లోని నూనెలు శిలీంధ్రాలను, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా పోరాడతాయి. ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

  • యాలకుల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగిన టెర్పెనెస్‌, ఫినోలిక్‌ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు యాలకుల నీటిని తాగితే పెద్ద మొత్తంలో శరీరానికి యాంటీఆక్సిడెంట్‌లు అందడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

  • రక్తపోటును నియంత్రించి లిపిడ్‌ ప్రొఫైల్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనేక జంతు పరిశోధనలు యాలకుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు 2015లో జరిపిన అధ్యయనంలో యాలకులలోని యాంటిఆక్సిడెంట్లు గుండెపోటు నుంచి రక్షిస్తాయని తేలింది. అలాగే కొస్ట్రాల్‌ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయిని వెల్లడయ్యింది.

  • ముఖ్యంగా నోటి ఆరోగ్యం కోసం యాలకులను వినియోగిస్తే దుర్వాసన, కావిటీస్‌, చిగుళ్ల వ్యాధులు దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

(చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)

 

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)