Breaking News

దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్‌!

Published on Wed, 10/25/2023 - 13:57

దసరా సంబరాలు. ఊరు, వాడ, పల్లే, పట్టణం అనే తారతమ్యం లేకుండా అంబరాన్నంటాయి. భారత్‌లోని నలుమూల ప్రాంతాలు దసరా ఉత్సవాలతో మునిగితేలుతుంటే ఓ గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది. ఇది ఈ ఏడాది వ్యవహారమూ కాదండోయ్‌. వందేళ్లుగా దసరా వేడుకలు జరగడం లేదీ గ్రామంలో.  పైగా గ్రామ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటారు ఎక్కడకి వెళ్లరు. ఎందుకిలా? అనుకుంటున్నారా? మంచి కారణమే ఉంది. తెలిస్తే మీరూ బాధపడే అవకాశమూ ఉంది. ఆ గ్రామ ప్రజల మనసెంత గొప్పదో కదా అనుకోకుండానూ ఉండలేరు. 

ఆ గ్రామం పేరు గగోల్‌. ఉండేది ఉత్తర ప్రదేశ్‌లో. మీరట్‌ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనిదీ పల్లె. ఇక్కడ దసరా రోజున ప్రజలు ఇంటిగడప దాటరు. నోరూ మెదపరు. మౌనంగా బాధను అనుభవిస్తున్నట్లు ఉంటారు. ఈ వింత పోకడలన్నీ ఎందుకంటే....ఎప్పుడో... 156 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని బ్రిటిష్‌ పాలకులు ఉరితీసిన విషయాన్ని గుర్తుపెట్టుకుని... ఇప్పటికీ పండుగ జరుపుకోకపోవడం విశేషం. వివరాలేమిటంటే....

భారతదేశ చరిత్ర ఓ ముఖ్యమైన సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. బ్రిటీష్‌ వలసవాద విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన తొలి వలసవాద వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బ్రిటీష్‌ వాళ్లు చాలా క్రూరంగా అణిచివేసినప్పటికీ ఎందరికో స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చేలా చైతన్యపరిచింది. వారిలోని దేశభక్తిని మేల్కొల్పి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన గొప్ప ఘటం అది. ఐతే ఈ 1857 సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుని భారత్‌లో పలు చోట్ల బ్రిటీషర్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు జరిగాయి. వీరిలో గగోల్‌ ప్రాంతవాసులు కూడా ఉన్నారు.

ఆ గగోల్‌ గ్రామం చుట్టపక్కల గ్రామాలైన మురాద్‌నగర్‌, నూర్‌నగర్‌, ప్రాంతవాసులు ఝండాసింగ్‌ సారథ్యంలో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న ఆంగ్లేయుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో బ్రిటీష్‌ వాళ్లు ఆ గ్రామస్తులపై  దాడికి దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం మీరట్‌ నగరానికి చెందిన కొత్వాల్‌ బిషన్‌ సింగ్‌ సాయం తీసుకున్నారు. అతను ఆంగ్లేయులను పక్కదారి పట్టించి వారి పన్నాగాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఫలితం... ఆ గ్రామాల ప్రజలు సులభంగా తప్పించుకోగలిగారు. కానీ గ్రామాలను ధ్వంసమైపోయాయి.  దీంతో ఝుండా సింగ్‌ పారిపోక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతడు బ్రిటిష్‌  వారి  చేతిలోనే హతమయ్యాడు.

కానీ హింస అక్కడితో ఆగలేదు. ఝండాసింగ్‌ నేతృత్వంలో దాడులకు దిగిన సుమారు తొమ్మిది మందిని బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేయడమే కాకుండా.. వారికి మరణదండన కూడా విధించారు. 1857 దసరా రోజున ఆ తొమ్మిది మందిని ఉరితీశారు. ఆ వీరుల పేర్లు రామ్‌ సహాయ్‌​, ఘసితా సింగ్‌, రమణ్‌ సింగ్‌, హర్జాస్‌ సింగ్‌, హిమ్మత్‌ సింగ్‌, కధేరా సింగ్‌, శిబ్బా సింగ్‌, బైరామ్‌, దర్బాసింగ్‌ తదితరులు. ఈ తొమ్మిదిమంది జ్ఞాపకార్థం వారిని ఉరితీసిన మర్రి చెట్టు కింద సమాధులు నిర్మించారు గ్రామస్తులు.

ఏటా దసరా రోజున ప్రజలు వారికి నివాళులర్పించి వారి స్మృత్యార్థం వేడుకలు జరుపుకోవడం మానేశారు. ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు దాదాపు 156 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. స్వాతంత్రం కోసం పాటుపడి, ఆ పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకోకుండా ఇంట్లోనే ఉంటూ మౌనం పాటిస్తున్న ఆ గ్రామ ప్రజలు నిజంగా వందనీయులు. ఆ గ్రామ ప్రజలకు దేశం పట్ల, స్వతంత్రం కోసం ప్రాణాలొదిలిని అమరవీరుల యందు కనబరుస్తున్న గౌరవానికి, ప్రేమకు ఫిదా కావల్సిందే కదూ. 

(చదవండి: ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..)


 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)