Breaking News

చేతి రాతే భవిష్యత్తుకు బాట..

Published on Sun, 06/22/2025 - 08:13

సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అందమైన చేతి రాత ఉన్న పిల్లలు పరీక్షల్లో అన్సర్‌ తెలియక΄ోయినా గుండ్రంగా ఏదో ఒకటి రాస్తారు. ఆ రాత చూసి పోనీలే పం అని టీచర్లు ఒక మార్కయినా వేస్తారు. అదే చేతి రాత బాగా లేని పిల్లలు అన్సర్స్‌ను చాలా కరెక్ట్‌గా రాసినా దిద్దే మేష్టార్లకు అర్థంగాక, చిరాకు అనిపించి ఒక మార్కు తక్కువ వేస్తారు.

పిల్లలకు చేతి రాతే వ్యక్తీకరణ సాధనం, ఆయుధం. వాళ్లు క్లాస్‌రూమ్‌లో మాటల ద్వారా కనపరిచే తెలివితేటలు పరీక్షకు నిలవవు. చేతి రాత ద్వారా ఏదైతే రాస్తారో, రాసి మెప్పిస్తారో అదే నిలుస్తుంది. కాని దురదృష్టం ఏమిటంటే చేతిరాత గురించి పెద్దలు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. స్కూల్లో టీచర్లు సరిదిద్దలేక పోతున్నారు.

రూపం కంటే స్పష్టత ముఖ్యం
చేతి రాత అందరిదీ ముత్యాల్లా ఉండదు. కొందరిది సహజంగా బాగుంటుంది. మరికొందరిది ప్రయత్నం మీద బాగుపడుతుంది. ఇంకొందరిది చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ గందరగోళం పిల్లలు అందంగా రాయడం కంటే అర్థం అయ్యేలా రాయడంపై శ్రద్ధ పెడితే చాలామటుకు సమస్య ఉండదు. ఆ సంగతి వారికి చెప్పి రాతను బాగు చేయాలి.  

రాత సరిగా ఉండకపోవడానికి కారణాలు

వేళ్ల సామర్థ్యం బలంగా లేకపోవడం 

పెన్ను లేదా పెన్సిల్‌ తప్పుగా పట్టుకోవడం 

త్వరత్వరగా రాయడానికి ప్రయత్నించి కంగాళీ చేయడం ∙నోట్స్‌లోని పేజీలై΄ోతాయేమోనని ఇరికించి రాయడం 

కొన్నిసార్లు దృష్టిలోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎక్కువ మంది పిల్లలు చేసే పొరపాటు పెన్ను తప్పుగా పట్టుకోవడం. పలక నుంచి పెన్సిల్‌కు మారేటప్పుడు ఈ పొరపాటు మొదలవుతుంది. కొందరు రెండు వేళ్లతో మరికొందరు మూడు వేళ్లతో పెన్సిల్‌ను పట్టుకుంటారు. కాని బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు కలిపి పట్టుకుని రాయడం మంచి పద్ధతి అంటారు నిపుణులు. కొందరు ఘంటంలా పట్టుకుంటారు. దీనిని నివారించాలి.

కూర్చునే పద్ధతి సరి చేయాలి
రాయాలంటే కూర్చోవాలి. కింద కూర్చునే పద్ధతి ఒక రకంగా, స్కూల్‌ బెంచీ మీద మరోరకంగా ఉంటుంది. ఈ కూచుని రాసే పద్ధతిలో తేడా వల్ల కూడా రాత సరిగా ఉండదు. కొందరు  పుస్తకాలపై పూర్తిగా వాలిపోయి రాస్తుంటారు. మరికొందరు మోచేతులపై పడుకొని రాస్తారు. చేతి రాత బాగుండాలంటే నిటారుగా కూచుని, కాళ్లు నేలకు తగిలేలా ఉంచి రాయాలి. ఇలా చేయడం వల్ల హ్యాండ్‌ రైటింగ్‌ స్కిల్స్‌ మెరుగుపడే అవకాశం ఉంటుంది.  

ఎంత ఒత్తిడితో రాయాలి?
కొందరు పిల్లలు పెన్ను/పెన్సిల్‌పై ఎక్కువగా ఒత్తిడి పెట్టి రాస్తారు. మరికొందరు ఒత్తిడి పెట్టరు. ఒత్తిడి పెడితే రైటింగ్‌ స్పీడ్‌ తగ్గుతుంది. వేళ్లు కూడా నొప్పి పుడతాయి. దీంతో పిల్లలు అలసి΄ోతారు. కాబట్టి పెన్సిల్‌ లేదా పెన్నును తేలికగా పట్టుకునేలా చూడండి. 

ఇలా చేయడం వల్ల రైటింగ్‌ ఫ్లో మెరుగవుతుంది. కలర్స్‌ వేయడం, డ్రాయింగ్‌ చేయించడం వంటివి వేళ్లకు ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తాయి. పిల్లలకు మంచి పెన్ను, పెన్సిల్‌ ఇవ్వాలి. నాసిరకమైన పెన్సిల్స్, పెన్నులు వాడితే అవి విరిగిపోతుంటాయి. దీంతో పిల్లలు చేతిరాతపై దృష్టి పెట్టలేరు. రాసే మూడ్‌ పోతుంది.

చేతిరాత చదువు కోసమే కాదు నిత్య జీవితం లో కూడా ఎంతో అవసరం. మన చేతి నుంచి రాసే అక్షరం శుభ్రంగా ఉంటే ఉండే ఆత్మవిశ్వాసం వేరు. మంచి చేతి రాతతో రాసే ఉత్తరాలు, వినతులు, విజ్ఞాపన పత్రాలు వెంటనే ఇంప్రెస్‌ చేస్తాయి. తక్షణ ప్రభావం చూపుతాయి.

(చదవండి: మిసెస్‌ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!)
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)