తల్లి మెనోపాజ్ దశ కూతురికి ఎందుకు అవసరం?

Published on Wed, 08/05/2026 - 10:22

ప్రస్తుత రోజుల్లో ప్రతి కుటుంబంలోని మహిళల మెనోపాజ్ గురించి బహిరంగంగా చర్చించడం, దానిని సాధారణ విషయంగా చూడటం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో రుతుస్రావం (పీరియడ్స్) శాశ్వతంగా ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. భవిష్యత్ తరాల మహిళల కోసం తల్లుల మెనోపాజ్ అనుభవాలను కూతుళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తన చిన్నతనంలో  తన తల్లి మెనోపాజ్ దశను ఎదుర్కొన్నప్పుడు దాని గురించి ఎలాంటి  అవగాహన లేదని, ఆమె ఎదుర్కొన్న భావోద్వేగాలను కేవలం ‘ఒత్తిడి’గా భావించామని ఓ మహిళ గుర్తుచేసుకున్నారు. ఈ అంశంపై సరైన చర్చ లేకపోవడం వల్ల తల్లులు పడే ఇబ్బందులు కూతుళ్లకు అర్థంకావని ఆమె పేర్కొన్నారు.

భారతీయ కుటుంబాలలో మెనోపాజ్ ఇప్పటికీ ఒక రహస్య విషయంగానే ఉంది. దీనివల్ల తల్లుల శారీరక, మానసిక ఇబ్బందులు కూతుళ్లకు తెలియవు. కొన్ని లక్షణాలను బట్టి తల్లులు కేవలం కోప్పడుతున్నారని భావిస్తారు. కానీ వాస్తవానికి వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. ఈ దశపై అవగాహన పెంచుకోవడం ద్వారా కూతుళ్లు తమ తల్లుల కష్టాలను అర్థం చేసుకుని తగిన సహకారం అందించగలుగుతారు.

భవిష్యత్తులో కూతుళ్లు కూడా ఇదే దశను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తల్లి అనుభవాల ద్వారా ముందస్తు సంకేతాలను గుర్తించి, వైద్య సహాయం ఎప్పుడు అవసరమో తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మౌన సంస్కృతిని బద్దలు కొట్టాలి. తల్లితో ఈ అంశంపై మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో తన కూతుత్తోనూ  చర్చించే అవకాశం లభిస్తుంది. ఈ విజ్ఞానాన్ని తరతరాలకు అవసరమైనదిగా భావించి, కుటుంబాలలో మెనోపాజ్‌పై చైతన్యం తేవాలని, తద్వారా మహిళల సమస్యలను అర్థం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘కే బ్యూటీ’ గ్లాస్ స్కిన్ రహస్యం.. వంట గదిలో.. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)