Breaking News

వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఎందుకు మంచిదంటే..?

Published on Sat, 04/26/2025 - 10:08

వేసవికాలంలో మజ్జిగ మహాపానీయం ఆరోగ్యానికి మంచిది. ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాంటి పానీయానికి సంస్కృతంలో తక్రం, మధితం, ఉదశ్విత్తు అని మూడు పేర్లు ఉన్నాయి. 

తక్రం : నాలుగో వంతు నీరుపోసి తయారు చేసేది తక్రం. 

మధితం : అసలు నీరు పోయకుండా చిలికినది. ఇది రుచిగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. 

ఉదశ్విత్తు : సగం నీళ్లు పోసి తయారు చేసేది. ఈ మూడింటిలో తక్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 

వేడి నుంచి ఉపశమనాన్నిస్తుంది.. 
గతంలో అయితే ఇంటికి వచ్చిన అతిథులకు.. ఎండలో వచ్చిన వారికి, వెళ్లే వారికి మజ్జిగను ఇచ్చేవారు. బాగా చిలికిన మజ్జిగలో ఒక నిమ్మకాయరసం, తగినంత ఉప్పు, చిటికెడు పంచదార కలిపి ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లే వారు గాజుసీసాలో మజ్జిగ తీసుకెళ్తే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. 
– ఉన్నవ పూర్ణచందర్‌రావు, మూసారంబాగ్‌ 

వేసవిలో కూర్చిక పానీయం.. 
ఒక గ్లాసు పాలు తీసుకుని కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపాలి. ఈ పానీయాన్ని కూర్చిక అంటారు. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాములు చొప్పున దేనికదే మెత్తగా దంచి కలుపుకోవాలి. ముందుగా ఈ మూడింటినీ కలిపి తగినంత ఉప్పు చేర్చి దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. 

కూర్చికను తాగినప్పుడల్లా అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే.. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది. దప్పికని పోగొడుతుంది.

మజ్జిగ తాగేవారికి ఏ వ్యాధులూ దరిచేరవని, వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని, విషదోషాలు, దుర్భలత్వం, చర్మరోగాలు, ధీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమితవేడి తగ్గిపోతుందని, శరీరానికి మంచి వర్చస్సు కలుతుందని యోగరత్నాకరంలో పేర్కొన్నారు. 

ప్రయోజనాలు..

  • వేసవిలో మజ్జిగ ఎక్కువగా తీసుకోడం వల్ల శరీరంలో లవణాలను తగ్గకుండా చేస్తుంది.

  • తోడుపెట్టినందు వల్ల పాలల్లో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉంటాయి. దీంతోపాటు మంచి బ్యాక్టీరియా మనకు దొరుకుతుంది. 

  • ఫ్రిజ్‌లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా దెబ్బతింటుంది. అందుకే అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 

  • మజ్జిగను చిలకడం వల్ల తేలికగా అరిగే గుణం ఏర్పడుతుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ 
    మంచింది.  

(చదవండి: 'టీ లైఫ్‌'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)