Breaking News

అరటిపండు షేప్‌ అలా ఎందుకు ఉంటుంది?

Published on Sat, 04/18/2026 - 14:58

అరటిపండు (banana) అలా  వంగి ఎందుకు ఉంటుంది?ఈ డౌన్‌ మీకు వచ్చిందా? అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది.   అదేంటో  తెలుసుకుందామా?

అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్‌ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్‌ వంకరగా వస్తుంది. అరటిపండులో  పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్‌ స్పాట్స్‌ అంటారు. ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
 

 

 వింత పండు ’రంబుటాన్‌’ 

 ’రంబుటాన్‌’  పేరే వింతగా ఉందే? అవును. ’రంబుటాన్‌’ అంటే మలేషియా భాషలో ’వెంట్రుకలు’ అని అర్థం. ఎందుకంటే ఈ పండు బయటంతా పచ్చ, ఎరుపు రంగులో వెంట్రుకల్లాంటి మెత్తటి ముళ్లు ఉంటాయి. చూడ్డానికి చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన బళ్ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. అక్కడి పిల్లలు స్కూల్‌ అయిపోగానే రంబుటాన్‌ కొనుక్కుని తింటూ ఇంటికెళ్తారు. మన దగ్గర మామిడిపండు లాగా అన్నమాట. పై తొక్క తీస్తే లోపల తెల్లగా, జెల్లీలా, మెరుస్తూ ఉంటుంది. సరిగ్గా మన లిచీ పండు లాగానే. మధ్యలో ఒక చిన్న గింజ ఉంటుంది. దానిని తినకూడదు.

ఈ పండు రుచి కొంచెం పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. లిచీ + ద్రాక్ష కలిపినట్టు. అక్కడి పిల్లలు ‘ఒకసారి మొదలుపెడితే ఆపలేం‘ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొందరు జ్యూస్‌ చేసుకుంటారు, ఐస్‌ క్రీంలో వేసుకుంటారు.హెల్త్‌కి చాలా మంచిది! విటమిన్‌ ఇ ఉంటుంది – జలుబు దగ్గరికి రాదు. ఐరన్‌ ఉంటుంది – రక్తం బాగా పడుతుంది. ఫైబర్‌ ఉంటుంది – కడుపు హ్యాపీ. మొదటిసారి చూసిన వాళ్లు ‘అయ్యో ఇది పండా? బొమికా?‘ అని భయపడతారు. కానీ టేస్ట్‌ చూశాక ‘ఇంకోటి ఇంకోటి’ అని అడుగుతారు. 

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)