Breaking News

ఎవరీ ర్యాన్‌ కోహెన్‌..? కాలేజీ డ్రాపౌట్‌ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..

Published on Thu, 05/07/2026 - 13:57

కాలేజ్‌ డ్రాపౌట్‌ కాలిఫోర్నియాలో శాన్‌హౌస్‌ కేంద్రంగా  పనిచేసే ఒక అమెరికన్ బహుళజాతి ఇ-కామర్స్ సంస్థ కొనడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అతడిపేరు  హాట్‌టాపిక్‌గా మారింది. ఎవ్వరూ కొనమని కోరకపోయినా..నేరుగా బిడ్‌ వేయడంతో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతనెవరంటే..

గేమ్‌స్టాప్ సీఈఓ ర్యాన్‌ కోహెన్‌ ఏకంగా 56 బిలియన్ డాలర్లు(రూ. 5 లక్షల కోట్లుపైనే) విలువ చేసే ఈబేను కొనడానికి బిట్‌ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నగదు, స్టాక్‌ల  50-50 నిష్పత్తిలతో కలిపి ఒక్కో షేరుకు రూ. 11 వేలు చెల్లించేలా బంపర్‌ ఆఫర్‌ ఇస్తానంటూ ఈబే బోర్డుకు లేఖ రాశారు. దాంతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కాలేజ్‌ డ్రాపౌట్‌ బిలియనీర్‌ ఎవరా అంటూ అంత చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

ర్యాన్‌ కోహెన్ ఎవరంటే..
ఆయన స్వస్థలం కెనడాలోని మాంట్రియల్. ప్రస్తుతం సుమారు 4.2 బిలియన్ డాలర్లు(రూ. 39 వేల కోట్లు) సంపద కలిగిన 40 ఏళ్ల పారిశ్రామికవేత్త.  కాలేజీ చదువును పూర్తిగా వదిలేసి, ఒక అసాధారణ మార్గంలో బోర్డు స్థాయికి చేరుకున్నారు. ఆయన రోవన్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ తర్వాత చదువు మానేశారు. డిగ్రీకి బదులుగా, అతను చ్యూయీని నిర్మించి, 2017లో దానిని పెట్‌స్మార్ట్‌కు 3.35 బిలియన్ డాలర్లు(రూ. 31 వేల కోట్లు)కు విక్రయించాడు. 

ఆ తర్వాత అతను గేమ్‌స్టాప్ మీమ్-స్టాక్ పునరుద్ధరణలో కీలకంగా మారారు. ఆయన నాయకత్వంలోనే గేమ్‌స్టాఫ్‌ రూ. 3 వేల కోట్ల నష్టం నుంచి రూ 4 వేల కోట్లకు పుంజుకుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ కంపెనీ 2026 ప్రారంభంలో మొత్తం 470 యూఎస్ స్టోర్లను కలిగి ఉంది.  దాంతో ఇప్పుడు  అతను గేమ్‌స్టాప్ కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఈబే కంపెనీని నడపాలని, దానిని అమెజాన్‌కు సరైన పోటీదారుగా మార్చాలని కోరుకుంటున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

అంతేగాదు కోహెన్‌ తాను రాబోయే కొన్నేళ్లపాటు, గేమ్‌స్టాప్ పునరుద్ధరణలో ఎంతగా దృష్టి పెట్టానో, అలాగే ఈబేపై కూడా దృష్టి పెడతానుని అన్నారు. తాను ఈబేను వందల బిలియన్ల డాలర్ల విలువైన సంస్థగా మార్చాలని  చూస్తున్నా అని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈబే బోర్డు సోమవారం ఈ ఆఫర్‌ను సమీక్షిస్తానని తెలిపింది.  ఇక కోహెన్‌ మాత్రం ఈబేను తాను ఇంటి నుంచి కూడా నడపగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అది 1995లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే కనిపిస్తుందని విమర్శించారు. తాను మార్కెటింగ్, ఉత్పత్తి అభివృద్ధి,  ఇతర నిర్వహణ ఖర్చులను తగ్గించి లాభాల బాట పట్టించగలనని చెబుతుండటం విశేషం. 

(చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్‌కు ముగింపు..! ఆ కారణంతోనే..)


 

#

Tags : 1

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)