Breaking News

వాకింగ్‌ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా?

Published on Mon, 09/16/2024 - 12:19

రోజూ కనీసం అర్థగంట సేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది  ఖర్చులేనిది. అనువైంది కూడా  క్రమం తప్పకుండా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య సమస్యలనుంచి బయటపడొచ్చు. సాధారణంగా, గుంపులుగా, జంటలుగా,  స్నేహితులతో వాకింగ్‌ చేస్తూ ఉండటం, పార్కింగ్‌ల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ చూస్తూ ఉంటాం.  అయితే వాకింగ్‌ ఎలా చేయాలి.  ఎపుడు  చేయాలి? ఒంటరిగాచేయాలా? లేక తోడు ఉంటే మంచిదా? ఇలాంటి విషయాల గురించి ఎపుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి!

ఏ సమయంలో  చేయాలి? 
వ్యాయామం ఎపుడు చేసినా దాని ప్రయోజనాలు దానికుంటాయి. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిదని చెబుతారు.   ఉదయం ట్రాఫిక్‌ బెడద ఉండదు,   కాలుష్యం తక్కువ. వీటిన్నింటికంటే ఉదయం వాతావరణం ప్రశాంగంగా ఉంటుంది. సూర్యుని లేలేత కిరణాలు, శరీరానికి, మనసుకు ఉత్తేజానిస్తాయి.

రోజుకు క‌నీసం గంట అయినా వాకింగ్  చేస్తే ఫలితాలు బావుంటాయి.  ఉద‌యం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున రోజులో గంట చేసినట్టువుతుంది. వాకింగ్‌ను ప్రారంభించేట‌ప్పుడు నెమ్మ‌దిగా న‌డ‌వాలి. అటవాటైన కొద్దీ క్ర‌మంగా వేగం పెంచాలి. షుగర్‌ పేషెంట్లే, గుండె జబ్బులున్నవారు   ఏదైనా కాస్త తిన్నాక చేయడం మంచిది.   వాకింగ్ కోసం సౌక‌ర్యవంతంగా ఉండే షూస్ ధ‌రించడం, పార్క్‌ల్లో కాకుండా ఆరుబయట నడిచే వారు కుక్కల నుంచి తప్పించుకునేందుకు  చేతి కర్ర ఉంటే మంచిది.

ఒంటరిగా చేయాలా? తోడు ఉండాలా?
ఒంటరిగా నడవడం వల్ల ఏకాగ్రత ఉంటుంది,  నడకచురుగ్గా ఉంటుంది
మాట్లాడుకుంటూ నడిస్తే  తొందరంగా ఆయాసం వస్తుంది.  ఏకాగ్రత ఉండదు. 
ఏదైనా వ్యాయామంద్వారా ప్రయోజనం పొందాలంటే కాన్‌సెంట్రేషన్‌ ముఖ్యం.  ఇద్దరు లేదా ముగ్గురుఉంటే ఇది సాధ్యపడకపోవచ్చు. సరైన వేగంతో నడిస్తేనే ఫలితం బావుంటుంది. కనుక ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఒంటరిగా నడవడం ఉత్తమ మార్గం.

అయితే భర్త లేదా భార్యతోనో, స్నేహితులతోనో కలిసి నడిస్తే ప్రయోజనం ఉండదా? ఉంటుంది. ఎలా అంటే..

పార్టనర్‌ ఉంటే నడక బోర్‌ కొట్టదు. ఉత్సాహంగా ఉంటుంది. 
జంటగా అయితే మీ వేగాన్ని అందుకోగల వారైతే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. పోటీ తత్వం ఉంటుంది.
వృద్ధులు తమతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు మరింత సురక్షితంగా భావిస్తారు. 
పెద్దవాళ్లు గుంపులుగా నడవడం ఖచ్చితంగా సురక్షితం.

వాకింగ్‌ ఎపుడు, ఎలా అనేది మనకున్న వెసులుబాటు, మనం అనుకున్న లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో చేసినపుడు మాత్రమే చక్కటి ఫలితం లభిస్తుంది.

ఇదీ చదవండి:  గణపతి బప్పా మోరియా : స్టార్‌ కిడ్‌ రాహా ఎంత ముద్దుగా ఉందో!


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)