Breaking News

అమెరికన్‌ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?

Published on Sun, 08/04/2024 - 10:41

సైలెంట్‌ కిల్లర్‌లాంటి డయాబెటీస్‌ వ్యాధులకు సంబంధించి టైప్‌ 1, టైప్‌ 2 గురించి విన్నాం. కానీ ఇందులో మరొకటి కూడా ఉంది. అదే డయాబెటిస్‌ టైప్‌ 1.5. ఈ వ్యాధితోనే అమెరికన్‌ గాయకుడు బాధపడుతున్నాడు. ఒకరకంగా అతని కారణంగానే ఈ డయాబెటిస్‌ టైప్‌​ 1.5 వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటీ వ్యాధి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

అమెరికన్‌ గాయకుడు నర్తకి లాన్స్‌ బాస్‌ తొలుత టైప్‌ 2తో బాధపడుతున్నట్లుగా వైద్యులు తప్పుగా గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించిన చికిత్సే కొన్నేళ్లు తీసుకున్నాడు. చివరికీ అతడు డయాబెటస్‌ టైప్‌ 1.5 అనే మరో రకం మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇంతకీ ఏంటీ డయాబెస్‌ టైప్‌ 1.5 అంటే..

టైప్‌ 1.5 డయాబెటిస్‌ అంటే..
దీన్ని లాడా లేదా లాటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ పోలిన లక్షణాలనే చూపిస్తుంది. ఇద యుక్త వయసులో వచ్చే వ్యాధిగా పేర్కొన్నారు. ఇది అచ్చం టైప్‌ 2 వలే ఉండి క్రమంగా లాడా మాదిరి స్వయం ప్రతి రక్షక పరిస్థితిని కలుగజేస్తుంది. ఇది ఆహారం, జీవనశైలి మార్పులతో సరి అయ్యేది కాదు. దీని ప్రకారం గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం చాల కష్టంగా ఉంటుంది. 

ఎప్పుడూ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేని స్థితి అని చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు మధుమేహం ఉన్నవారిలో దాదాపు 10% మందికి లాడా ఉందని అన్నారు. ఈ పరిస్థితిని ఫేస్‌ చేస్తున్న రోగి  గ్లూకోజ్ మానిటర్‌ని ధరించాల్సి ఉంటుంది. ఇది ప్రతి కొన్ని నిమిషాలకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రీడింగ్‌లను నమోదు చేస్తుంటుంది. ఒకవేళ అందులో మార్పులు జరిగితే హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. 

లక్షణాలు..

  • తరచుగా దాహం

  • అధిక మూత్రవిసర్జన

  • వివరించలేని బరువు తగ్గడం

  • అస్పష్టమైన దృష్టి, నరాలు జలదరింపు

చికిత్స చేయకుండా వదిలేస్తే, టైప్ 1.5 డయాబెటిస్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారి తీస్తుంది, ఇది ఇన్సులిన్ లేకపోవడం, కొవ్వును కరిగించడం వంటి వాటికి దారితీసి చివరికి గ్లూకోజ్‌ను ఇంధనంగా ఉపయోగించలేకపోతుంది. తద్వారా శరీరంలో విషపూరితమైన కీటోన్‌లను ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది.

ఎందువల్ల వస్తుందంటే..
ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా ప్రతిరోధకాల నుంచి ప్యాంక్రియాస్‌కు నష్టం జరగడం వల్ల టైప్ 1.5 వస్తుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో, స్వయం ప్రతిరక్షక పరిస్థితుల కుటుంబ చరిత్ర వంటి జన్యుపరమైన అంశాలు కూడా ఉంటాయి. టైప్ 1.5 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు టైప్‌ 1 మాదిరిగా శరీరం ప్యాంక్రియాటిక్ బీటా కణాలను నాశనం చేస్తుంది. ఈ టైప్ 1.5 మధుమేహం ఉన్న వ్యక్తి ఒకవేళ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే ఇన్సులిన్ నిరోధకత కూడా ఉండే అవకాశం ఉటుందని అన్నారు వైద్యులు.

చికిత్సకు 
శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల టైప్ 1.5 మధుమేహం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే టైప్ 2 డయాబెటిస్‌ మాదిరిగా నోటి ద్వారా తీసుకునే మందులతో నయం చేయొచ్చు. అలా కాకుండా చాలా ఆలస్యంగా గుర్తించితే మాత్రం ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ వ్యాధి చికిత్సలో చాలా వరకు ఇన్సులిన్‌ ఇవ్వడమే జరుగుతుంది. అదికూడా రోజువారీ మోతాదు మారుతు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

(చదవండి: శారీరక మానసిక ఆరోగ్యం కోసం బ్రేక్‌ తీసుకోవాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారంటే..)
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)