Breaking News

ట్యూషన్‌ ఎవరికి అవసరం? ట్యూషన్‌ టీచర్‌ ఎలా ఉండాలి?

Published on Fri, 06/27/2025 - 09:45

మూడేళ్లు రావడంతోటే పిల్లల్ని స్కూల్లో వేయడం,ఉద్యోగాల నుంచి వచ్చే వరకూ ట్యూషన్‌లో ఉండేలా ప్లాన్‌ చేయడంమన దగ్గర సర్వసాధారణం.ఏ వయసు పిల్లలకైనా ఏ తరగతుల్లో అయినాట్యూషన్‌ చెప్పించడం ప్రిస్టేజ్‌ ఇష్యూగా మారింది.నిజంగా పిల్లలకు ట్యూషన్‌ అవసరమా? ఏ వయసులో అవసరం? దాని వల్ల జరిగే మంచి ఏమిటి, ప్రతికూలత ఏమిటి... తెలుసుకుందాం.

మన దగ్గర ట్యూషన్‌ చెప్పించడం రెండు ఆలోచనల్లో భాగంగా ఉంటుంది. ఒకటి: పిల్లలు బాగా చదువుకోవాలి  రెండు: టైమ్‌ వేస్ట్‌ జరగకుండా ట్యూషన్‌కు పంపడం మంచిది.

ఈ రెండో విధానానికి తెలివైన పిల్లలు, తెలివితక్కువ పిల్లలు అనే తేడా లేదు. ట్యూషన్‌కు పంపడం వల్ల వారిని క్రమశిక్షణలో పెడుతున్నామనే సంతృప్తి తప్ప. దీనివల్ల తెలివైన పిల్లల వికాసానికి కొంతమేర నష్టం జరగొచ్చు. ఎందుకంటే ఈ పిల్లలు స్వయంగా చదువుకోగలరు. స్వయంగా చదువుకోవడం వల్ల వారికి ఇంకా తెలివితేటలు పెరుగుతాయి. ఇలాంటి పిల్లలను ట్యూషన్‌కు పంపితే భారం టీచరు మీద వేసి తమ తెలివికి విరామం ప్రకటించవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు సాయంత్రాలు ఇంట్లో ఉండకుండా ఏదో ఒక ట్యూషన్‌కు వెళ్లడం మంచిది అనే ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన మీ పిల్లలకు ఏ మేరకు వర్తిస్తుందో గమనించుకోవాలి.

అసలు ట్యూషన్‌ చెప్పించడం  ఎవరికి అవసరం?
చాలా మంది తల్లిదండ్రులు తమ మూడేళ్ల చిన్నారులను కూడా ట్యూషన్‌లో చేర్పిస్తున్నారు. ఇది వారికి మేలు చేయక΄ోగా మొత్తం పెరుగుదల, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా పిల్లలకు ఆరేళ్లు వచ్చాక ట్యూషన్‌ గురించి ఆలోచించవచ్చు. హైస్కూల్‌ స్థాయి వరకు వీరికి ట్యూషన్‌ అవసరం కావచ్చు. అయితే అందరికీ ఇది అక్కర్లేదు. 

మరి ఎవరికి కావాలి?

  • చదువులో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు... మేథ్స్, సైన్స్‌ వంటి సబ్జెక్ట్‌లు స్కూల్లో చెప్పినవి మరింత అర్థం కావాలంటే ట్యూషన్‌ పెట్టాలి.

  •  కొందరు పిల్లలకు చదువు చాలా ఆసక్తిగా ఉంటుంది. వీరు స్కూల్లో చదివిందే కాక ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. ట్యూషన్‌ పెడితే టీచర్‌ను సందేహాలు అడిగి ఆ సబ్జెక్ట్‌లో పర్‌ఫెక్ట్‌ కావాలనుకుంటే లేదా పరీక్షల్లో మార్కులు బాగా రావాలనుకుంటే అలాంటి పిల్లలకు ట్యూషన్‌ కావాలి. 

  • కొందరు పిల్లలకు స్వతహాగా తెలివితేటలు ఉన్నా టీచరు సహాయం ఉంటేనే ఆత్మవిశ్వాసంతో చదువుకుంటారు. లేదంటే ఒత్తిడి ఫీలవుతారు. ఇలాంటి వారికి ట్యూషన్‌ అవసరం.

  • కొందరు పిల్లలు చదువుతున్న స్కూళ్లలో టీచర్లు సరిగా ఉండరు. లేదా ఫలానా సబ్జెక్ట్‌ను సరిగ్గా చెప్పరు. పిల్లలు ఇది గమనించి ఇంట్లో చెబుతారు. అప్పుడు ఆ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా ట్యూషన్‌ పెట్టించాలి. 

  • కొందరు పిల్లలకు తల్లిదండ్రులే ట్యూషన్‌ చెప్పగలరు. కాని వారికి వివిధ కారణాల వల్ల వీలు ఉండదు. ట్యూషన్‌ పెట్టించి తాము పైనుండి అజమాయిషీ చేద్దామనుకుంటే అలాంటి సమయంలో ట్యూషన్‌ పెట్టించాలి.

  •  స్కూల్లో ఎన్ని పిరియడ్స్‌ ఉన్నాయి, వారానికి ఐదు రోజుల బడినా లేదా ఆరు రోజుల బడినా అనేదాన్ని బట్టి కూడా ట్యూషన్‌ అవసరమా కాదా అనేది నిర్ణయించాలి. స్కూల్లో పిరియడ్‌లు రోజుకు 8 ఉండి, వారానికి ఆరు రోజులు బడి నడుస్తుంటే అలాంటి పిల్లలకు రోజూ ట్యూషన్‌ చాలా భారమవుతుంది. వీరికి వారానికి ఒకరోజు ట్యూషన్‌ చాలు. అదే ఐదు రోజుల బడి ఉంటే వారానికి రెండు రోజులు ట్యూషన్‌ చాలు. అంతిమంగా పిల్లలు చదువుకోవాలి... బెంబేలు పడకూడదు.

  • ఆన్‌లైన్‌ ట్యూషన్లు పెట్టించవచ్చని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. ఇవాళ ఆన్‌లైన్‌లో ఇబ్బడి ముబ్బడిగా ట్యూషన్లు ఉన్నాయి. కాని ముఖాముఖి ట్యూషన్లే ఎక్కువ ప్రభావవంతమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఆన్‌లైన్‌ ట్యూషన్లను వీలైనంతగా పరిహరించాలి. (Hyderabad: సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌కు నగరం చిరునామా)

ట్యూషన్‌ టీచర్‌ ఎలా ఉండాలి?
చాలా మధ్యతరగతి ఇళ్లలో ఇరుగు పొరుగున ఎవరైనా ట్యూషన్‌ చెబుతుంటే వారి దగ్గరకు ట్యూషన్‌కు పంపి చేతులు దులుపుకోవడం అలవాటు. కాని ట్యూషన్‌కు పంపాలంటే ఆ ట్యూషన్‌ చెప్పేవారి యోగ్యతలు కూడా కచ్చితంగా చూడాలి.

వారి విద్యార్హత ఏమిటి? : తాను బోధించే సబ్జెక్టులో మంచి నైపుణ్యం కలిగి ఉందా? విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతోందా? క్లిష్టమైన భావనలను సులభంగా అర్థమయ్యేలా వివరించగలగాలి.

బోధనా నైపుణ్యాలు : సహనం ఏ మేరకు ఉంది. చిరాకు పడుతున్నదా? విద్యార్థులు తప్పులు చేసినప్పుడు లేదా ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు, ఓపికగా మరియు అర్థమయ్యేలా వారికి వివరించగలుగుతోందా?

గుంపును కూచోబెట్టి ‘చదువుకోండ్రా’ అనే టీచర్లు కూడా ఉంటారు. ఈ గుంపులో రకరకాల తరగతుల విద్యార్థులు ఉంటారు. ఇలాంటి ట్యూషన్‌ వల్ల  ఉపయోగం లేదు. మన పిల్లలనే కేంద్రంగా చేసుకుని ట్యూషన్‌ చెప్పే టీచర్‌ వద్దకే పంపాలి.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)