ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు
Breaking News
ఇది నవంబర్ కాదు మోవంబర్!
Published on Wed, 11/19/2025 - 11:09
ఈ నెల నవంబర్ కదా మరి ఇదేంటి మోవంబర్ అని అంటున్నారేంటి అనుకోకండి. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నేపథ్యంలో ఆ గమ్మత్తైన తమాషా స్టోరీ ఏంటో చూసేద్దామా..!
నవంబర్ నెలలో మీసాలను పెంచే కార్యక్రమమే... మోవంబర్. ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్‌లో మీసాలకు సంక్షిప్త నామం... మో. దీనికి నవంబర్ నెలను జత చేసి ‘మోవంబర్’ ను సృష్టించారు. ‘మోవంబర్’ సరదా కార్యక్రమేమీ కాదు. దీనికి సామాజిక ప్రయోజనం ఉంది.
పురుషుల ఆరోగ్య సమస్యలైన ప్రోస్టేట్ కేన్సర్‌పై అవగాహన కలిగించడం, పురుషుల ఆత్మహత్యలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం... మొదలైనవి ‘మోవంబర్’లో భాగం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ కేంద్రంగా మోవంబర్ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
(చదవండి: నేటి పురుషుడికి 10 సవాళ్లు)
Tags : 1