Breaking News

ఎక్కువ యాంటీబయాటిక్స్‌ వాడినా.. ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయా?

Published on Sun, 06/30/2024 - 03:10

సాధారణ వెజైనల్‌ డిశ్చార్జ్‌కి ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌కి తేడా ఏంటో చెప్తారా? – ఆలూరి సుష్మారెడ్డి, ఖానాపూర్‌

వెజైనల్‌ డిశ్చార్జ్‌ అనేది నార్మల్‌గా కూడా ఉంటుంది. ఇది నెలసరి సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా నెల మధ్యలో అండాల విడుదల సమయానికి తీగలాగా తెలుపు అవుతుంది. ఇది రెండు నుంచి అయిదు రోజులు అవుతుంది. నెలసరికి ముందు రెండు నుంచి అయిదు రోజుల వరకు థిక్‌గా ఈ వైట్‌ డిశ్చార్చ్‌ అవుతుంది.

ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి థిక్‌గా, లైట్‌గా, నీళ్లలా వైట్‌ డిశ్చార్జ్‌ ఉంటుంది. ఈ డిశ్చార్జెస్‌ ఏవీ రంగు, వాసన ఉండవు. దురద, మంట, ఎరుపెక్కడం వంటివీ ఉండవు. జ్వరం రాదు. వీటినే నార్మల్‌ వెజైనల్‌ డిశ్చార్జ్‌ అంటారు. ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ లేదా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌లో చాలా వరకు వెజైనాలో దురద, మంట, దుర్వాసన, దద్దుర్లు,  మూత్ర విసర్జనప్పుడు నొప్పి, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. డిశ్చార్జ్‌.. పెరుగులా, థిక్‌గా, గ్రీన్, యెల్లో కలర్స్‌లో ఉంటుంది.

తొడల మీద కూడా దద్దుర్లు వస్తాయి. అయితే ఇది లైంగిక వ్యాధి కాదు. ఏడాదిలో మూడు సార్లకన్నా ఎక్కువగా ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తే దాన్ని రికరెంట్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ అంటారు. దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్‌ఫెక్షన్స్‌  రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. వెజైనాలో సహజంగా ఉండే బ్యాలెన్స్‌ తప్పినప్పుడు ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. 

ఎక్కువ యాంటీబయాటిక్స్‌ వాడినా ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. యాంటీఫంగల్‌ క్రీమ్స్, జెల్స్, టాబ్లెట్స్‌తో ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్సను అందిస్తారు. కొన్నిసార్లు వెజైనల్‌ స్వాబ్‌ అనే చిన్న స్మియర్‌ టెస్ట్‌ చేసి ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారిస్తారు. పెల్విక్‌ పరీక్ష చేసినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తిస్తారు.  
– డా భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)