Breaking News

నెలకు ఎన్నిసార్లు ఉపవాసం చేస్తే మంచిది?

Published on Sat, 12/30/2023 - 12:06

లంకణం పరమౌషధం అని పెద్దొళ్లు ఊరకే చెప్పలేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ప్రయోగకరంగా నిరూపిస్తున్నారు. అమెరికాలోని శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం..ఉపవాసం ఉంటే శరీరంలో మంట/వాపు తగ్గిస్తుందట. రోగ నిరోధక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపకుండానే మంట/వాపులను నయం చేయగలదట. ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ చేసే మొట్టమొదటి పని మంట/వాపును సృష్టించడం. ఇది ఎక్కువ కాలం ఉంటే గుండెజబ్బులు, కేన్సర్‌, వంటి అనేక జబ్బులు చుట్టుముడతాయి.

ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎలుకల నిరోధక వ్యవస్థ కణాలపై అధ్యయనం నిర్వహించింది. ఉపవాసం ఉన్నప్పుడు మంట/వాపులకు కారణమయ్యే మోనోసైట్స్‌ ఉపవాసంలో నిద్రాణ స్థితికి చేరుకుంటాయని చెబుతున్నారు. మరిన్ని పరిశోధనలతో మంట/వాపులకు మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని, ప్రాణాంతక వ్యాధులను నివారించడం సాధ్యమవుతుందని వివరించారు. 


లంకనం(ఉపవాసం) అంటే తేలిగ్గా ఉండటం, భగవంతునికి సమీపంగా ఉండటం అని అర్థం. మనుసు, దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు ఆ తాదాత్మ్యతలో ఆకలిదప్పులు తెలియవు. ఏకాగ్రతతో కూడిన ధ్యానం వలన మానసిక దృఢత్వం అధికం అవుతుంది. తాత్కాలిక నిరాహారం వల్ల శరీర కణాలలోని జీవక్రియలు ఉత్తేజితమై,సర్వాంగాలలోనూ చైతన్య ప్రేరణ కలుగుతుంది. ఇదే దీర్ఘాయువునకు పెద్ద పీట. కొందరు గంటలు మొదలుకొని రోజుల వరకు ఉపవాసం చేస్తారు.

మరికొందరు మంచినీళ్లు కూడా తాగకుండా కఠోర ఉపవాసం చేస్తారు.వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు ఉపవాసం చేయడం ఉత్తమం. నిజానికి ఫాస్టింగ్‌లో ఏమీ తినకూడదు అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే కడుపునిండా తింటే నిద్ర రావడం, ప్రకృతి అవసరాల కోసం సమయం కేటాయించడం వంటివి చేస్తుంటాం. వీటన్నింటి కారణంగా దైవచింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు కాబట్టే ఉపవాసం రోజున భోజనం మానేసే సాంప్రదాయం వచ్చింది.

అయితే ఉపవాసం వల్ల ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి.  కనీసం పగలంతా ఘన పదార్థాలు (వండినవి) తినకుండా కేవలం ద్రవాహారంతో చేసినా జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. రాత్రి స్వల్పంగా తినవచ్చు. ఆయుర్వేదంలో కొన్ని జావలు (సూప్స్‌) చెప్పారు. (బియ్యప్పిండి, పేలాలు, అటుకులు, కూరగాయలు). వీటిలో పాచక పదార్థాలు (మిరియాల పొడి; వాము జీలకర్ర పొడులు, శొంఠి, పిప్పళ్ల పొడులు) వంటివి తీసుకోవచ్చు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)