Breaking News

'A2 నెయ్యి' అంటే..? దీనికి మాములు నెయ్యికి తేడా ఏంటంటే..

Published on Tue, 07/22/2025 - 14:12

నెయ్యి తినడం మంచిదని విన్నాం. ఇటీవలకాలంలో పోషకాహార స్పృహ ఎక్కువై..మంచి విటమిన్లుతో కూడిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో తిన్నామంటే తినడం కాకుండా..ఆరోగ్యదాయకమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఒకటే ఈ 'ఏ2 నెయ్యి' . దీన్ని ఆధునిక సూపర్‌ ఫుడ్‌గా కీర్తిస్తున్నారు. అంతేగాదు ఆయుర్వేద గ్రంథాల్లో సైతం దీన్ని "లిక్విడ్ గోల్డ్"గా వ్యవహరిస్తున్నారు. అసలేంటీ నెయ్యి..? మాములు నెయ్యికి దీనికి ఉన్న తేడా ఏంటంటే..

ఏ2 నెయ్యి అంటే..
గిర్, సాహివాల్ మరియు రతి వంటి స్వదేశీ భారతీయ ఆవుల పాల నుంచి తీసిన నెయ్యిని ఏ2 నెయ్యిగా వ్యవహరిస్తారు. దీన్ని తీసే విధానంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుందట. ఎందుకంటే మాములు వాటిలో పచ్చి పాల నుంచే నేరుగా నెయ్యిని సెపరేట్‌ చేయరు. పెరుగుగా తోడుపెట్టి పులిసిన మ‍జ్జిగ నుంచే వెన్నను సెపరేట్‌ చేసి చక్కగా కాస్తారు. ఇది చూడటానికి గోల్డెన్‌ రంగులో సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట. 

ఇందులో బీటా కేసిన్‌ ప్రోటీన్‌ మాత్రమే ఉంటుందట. అదే సాధారణ వాణిజ్య పాల్లో ఏ1 బీటా కేసిన్‌ ఉంటుందట. అంతేగాదు ఈ ఏ2 పాలు టైప్‌ 1 డయాబెటిస్‌, కరోనరి హార్ట్‌ డిసీటజ్‌ ఆర్టెరియోస్క్లెరోసిస్‌ ఆటిజం, స్కిజోఫెనియా వంటి శిశు ఆకస్మిక మరణాలను నివారించగలదట. ఈ ఏ2 నెయ్యిని 5 వేల ఏళ్లనాటి పురాతన పద్ధుతుల్లో చేయడం వల్లే ఇన్ని విటమిన్స్‌ , పోషకాలు సమృద్ధిగా ఉంటాయిట.

ఎలాంటి పోషకాలు ఉంటాయంటే.. 
ఇందులో విటమిన్‌ ఏ, విటమిన్‌ డీ, కాల్షియం, విటమిన్‌ ఈ, యాంటీ ఆక్సిడెంట్‌ విటమిన్‌ కే, ఒమేగా 3, ఒమేగా 9 తదితర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవేగాక మెదడు పనితీరుని మెరుగుపరిచే సంయోగ లినోలిక్ ఆమ్లం (CLA) వంటివి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అథ్లెట్లు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

సులభంగా జీర్ణమయ్యే సామర్థ్యం పెరుగుతుంది కూడా. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చి, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. పాలు, పన్నీర్‌ వంటివి పడవని వారికి ఈ ఏ2 నెయ్యి మంచి సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

చర్మం, జుట్టు, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలను నివారిస్తుందా..
ఈ ఏ2 నెయ్యి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సహజమైన మెరుపుని అందిస్తుంది. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరిచి, జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ ఉంటుందట. 

అలాగని మితీమిరీ వినయోగించొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు సమతుల్యతకు పెద్దపీట వేస్తే..ఏదైనా ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.

(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..)

 

 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)