Breaking News

6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!

Published on Wed, 11/20/2024 - 13:59

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ అనేది కాస్త కష్టమైపోయింది. ఏదో ఒక టెన్షన్‌తో రోజు గడిచిపోతుంది. ఇక వ్యాయామాలు చేసే టైమ్‌ ఏది. కనీసం నాలుగు అడుగులు వేసి వాకింగ్‌ చేద్దామన్నా.. కుదరని పరిస్థితి. అలాంటి వారు ఈ సింపుల్‌ 6-6-6 వాకింగ్ రూల్ ఫాలో అయితే చాలు.. సులభంగా వాకింగ్‌, వ్యాయామాలు చేసేయొచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ రూల్‌ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతకీ అదెలాగంటే..

రోజువారీ శారీరక శ్రమను పెంచేలా చిన్న చిన్న.. సెషన్‌లుగా విభజించే వాకింగ్‌ రూల్‌ ఇది. ఏం లేదు..జస్ట్‌ రోజు ఆరు నిమషాలు ఆరు సార్లు చొప్పున వారానికి ఆరు రోజులు చేయాలి. ఆరు నిమిషాలు చొప్పున నడక కేటాయించండి ఎక్కడ ఉన్నా.. ఇలా రోజంతా ఆరు నిమిషాల నడక..ఆరుసార్లు నడిచేలా ప్లాన్‌ చేసుకుండి. 

ఇలా వారానికి ఆరురోజులు చేయండి. ఈ విధంగా నడకను తమ దినచర్యలో భాగమయ్యేలా చేసేందుకు వీలుగా ఈ నియమాన్ని రూపొందించారు. ఆయా వ్యక్తులు తమ సౌలభ్యానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలు.. సులభంగా వాకింగ్‌ చేసి..మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ప్రయోజనాలు..

  • హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది

  • రక్తపోటుని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

  • మెరుగైన మాసిక ఆరోగ్యం సొంతం

  • ఈ చిన్న చిన్న వాకింగ్‌ సెషన్‌లు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. 

  • రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 

  • కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 

  • బరువు అదుపులో ఉంటుంది. 

చాలా చిన్నసెషన్‌ల నడక అయినప్పటికీ..క్రమం తప్పకుండా వారమంతా చేయడం వల్ల చక్కగా కేలరీలు బర్న్‌ అయ్యి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఈ నియమం హృదయ సంబంధ ఫిట్‌నెస్‌, మానిసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే అత్యంత ప్రభావవంతంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంపందించడం మంచిది. 

(చదవండి: ఫేమస్‌ బ్రిటిష్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ లోగోకి ప్రేరణ కాళిమాత..!)

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)