Breaking News

తిమింగలానికి కోపమొస్తే.. చుక్కలే! ఈ వైరల్‌ వీడియో చూడండి!

Published on Wed, 07/24/2024 - 13:37

అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ హార్బర్‌ సమీపంలో  చోటు చేసుకున్న ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.   ఒక  భారీ తిమింగలం చిన్న బోటు మీదికి  ఉన్నట్టుండి లంఘించింది.  దీంతో నడి సముద్రంలో  బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది?  తెలియాలంటే ఈ స్టోరీ  చదవాల్సిందే.

కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి  ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది.  వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో  సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే  బోట్‌పై ఎటాక్‌ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్‌ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన  ఇద్దరూ  సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.

 ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్‌షైర్‌ కోస్ట్‌లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని  తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే  సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు.  ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)