వెల్‌నెస్‌ కొత్త ట్రెండ్‌..ఒత్తిడిపై 'ఎత్తు'

Published on Tue, 03/17/2026 - 16:39

ఒకప్పుడు ‘సక్సెస్‌’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్‌.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్‌ జనరేషన్‌ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్‌నెస్‌ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్‌నెస్‌ అనగానే కేవలం యోగా క్లాస్‌/ డైట్‌ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్‌నెస్‌ అని లైఫ్‌స్టైల్‌ కోచ్‌ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. 

కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్‌ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్‌నెస్‌ ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లో చిన్న గెస్ట్‌హౌస్‌లు, నేచర్‌ గార్డెన్లు, వీకెండ్‌ రిట్రీట్స్‌ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్‌ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్‌ కల్చర్‌లోనూ వెల్‌నెస్‌ కీలకాంశంగా మారుతోంది. 

ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్‌ఆర్‌ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. 

కాన్షియస్‌.. మ్యాడ్‌ నెస్‌.. 
హైదరాబాద్‌ అంటే ఫుడ్‌ లవర్స్‌ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్‌ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్‌ క్లినిక్స్‌ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. 

అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్‌ చేస్తుంది. యువతపై సోషల్‌ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్‌ లెర్నింగ్, స్టార్ట్‌ అన్‌లెర్నింగ్‌’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్‌ మ్యాడ్‌ నెస్‌’ కాన్సెప్ట్‌కు బలం ఇస్తోంది. 

ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్‌ వాటర్‌ సైడ్‌లో యోగా, మెడిటేషన్, భజన్‌ జ్యూమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్‌ లైఫ్‌స్టైల్‌లో వెల్‌నెస్‌ కేవలం ట్రెండ్‌ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్‌ నుంచి స్ట్రెంగ్త్‌కి ప్రయాణమే నేటి హైదరాబాద్‌ కొత్త లైఫ్‌స్టైల్‌.  

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)