Breaking News

స్లిమ్‌గా మారిన నర్సు..బ్రేక్‌ఫాస్ట్‌గా గిన్నెడు పెరుగు..

Published on Fri, 06/06/2025 - 14:59

ఈ వెయిట్‌ లాస్‌ స్టోరీ వింటే అవాక్కవ్వుతారు. బాబోయ్‌ ఇవేం ఫుడ్‌ అలవాట్లు.. అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లతోనే స్లిమ్‌గా మారింది, కానీ బరువు తగ్గాలనుకునే వారు తీసుకోకూడని హెవీ ఫుడ్స్‌తోనే ఆమె బరువు తగ్గడం విశేషం. నోటిని కట్టడి చేయకుండా.. కడుపు నిండుగా తింటూ బరువు తగ్గి చూపించింది. పైగా అనారోగ్యకరమైన జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ..హాయిగా రుచికరమైన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలాగో చూపించింది. మరి ఆమె వెయిట్‌ లాస్‌ జర్నీ ఎలా జరిగిందో సవివరంగా చూద్దామా.!.

కెనడాకు చెందిన మెలనీ కోజ్(21) తన పనివేళల కారణంగా బర్గర్లు, ఫ్రైస్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేదట. దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొందట. చిన్న వయసులోనే అంత బరువు ఉండటంతో చాలా ఇబ్బందులు పడేది కూడా. పైగా వయసుకి మించిన అధిక బరువు ప్రమాదమని హెచ్చరించడంతో బరువు తగ్గేందుకు ఉప్రక్రిమించిందట. అందుకోసం పలు రకాల వర్కౌట్లు, యోగా, వ్యాయమాలు వంటివి ఎన్నింటినో చేసి.. దాదాపు రెండేళ్లు పూర్తిగా విఫలమైంది. 

ఇక లాభం లేదనుకుని..డైట్‌లోనే ఏదైనా మార్పు చేయాలి.. లేదంటే కష్టమే బరువు తగ్గడం  అని అర్థమైంది మెలోనికి. దాంతో న్యూట్రిషియన్‌ కోర్సులో చేరి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో సవివరంగా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి అధిక ప్రోటీన్‌తో కూడిన ఆహారాలు తినడం ప్రారభించింది. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా అధిక ప్రోటీన్‌తో కూడిన గిన్నెడు పెరుగు తోపాటు తాజా పండ్లను జోడించి తీసుకునేదట. 

ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించి చాలాసేపటి వరకు ఫుడ్‌ తినాలనే కోరికను నివారించేదట. అలాగే అనారోగ్యకరమైన చిరుతిండ్లన్నింటికి పూర్తిగా దూరంగా ఉండేదట. దాంతో తన బరువులో అనుహ్యమైన మార్పుల మొదలయ్యాయట. అలా 44 కిలోలక వరకు తగ్గానని, ప్రస్తుతం 69 కిలోలు ఉన్నట్లు తెలిపింది. అయితే తన డైట్‌లో తక్కువ ఫ్యాట్‌ కలిగిన చీజ్‌, చికెన్‌, చేపలు వంటి ఉన్నాయట. అలాగే తనకు ఇష్టమైన స్వీట్స్‌ కూడా తినేదాన్ని అంది. అది కూడా హెల్దీ స్వీట్స్‌ తప్ప..ప్రాసెస్‌ చేసినవి కావట. ప్రస్తుతం ఈ నర్స్‌ వెయిట్‌ లాస్‌ స్టోరీ నెట్టింట  తెగ వైరల్‌గా మారింది. 

అధిక ప్రోటీన్‌తో కూడిన ఆహారం బరువు తగ్గిస్తుందా..
ఇది కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అధికంగా ఫుడ్‌ తీసుకోవాలనే ఆలోచనను నివారిస్తుంది. అలాగే మంచి బలాన్ని అందించి..బరువు తగ్గాలనే లక్ష్యంపై ఫోకస్‌ పెట్టేలా చేస్తుంది. తద్వారా కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. 

ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే..కఠినమైన డైట్‌ల జోలికి పోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సరైన విధంగా తీసుకుంటే..ఆహారమే ఆరోగ్యం అని, అతిగా తీసుకుంటే విషంగా మారి అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లను నివారించి హెల్దీ ఫుడ్‌కి ప్రాముఖ్యత ఇస్తే బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుందట. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: రొటీన్‌ వాకింగ్‌ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !)
 

#

Tags : 1

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)