Breaking News

స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!

Published on Fri, 11/29/2024 - 15:24

చాలామంది వెయిట్‌ లాస్‌ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్‌లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్‌గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్‌గా అయ్యిపోతారు. అంత సింపుల్‌గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్‌గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్‌, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్‌లాస్‌ స్టోరీ తెలిస్తే కంగుతింటారు. 

ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్‌ ప్రోగ్రామ్‌లో తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్‌కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్‌ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది. 

అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది. 

బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్‌ పెట్టొచ్చని చాలా సింపుల్‌గా చెప్పేసింది నటి, మోడల్‌ హిమాన్షి ఖురానా.

 

 

(చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!)
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)